ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిపై వ్యాఖ్యలు.. వికారాబాద్ జిల్లాలో షర్మిలను అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు

By Siva KodatiFirst Published Aug 10, 2022, 7:41 PM IST
Highlights

వికారాబాద్ జిల్లాలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నిరసన సెగ తగిలింది. ప్రజా ప్రస్థానం యాత్ర చేస్తోన్న షర్మిలను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

వికారాబాద్ జిల్లాలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నిరసన సెగ తగిలింది. ప్రజా ప్రస్థానం యాత్ర చేస్తోన్న షర్మిలను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పాలని షర్మిల యాత్రను అడ్డుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. 

మరోవైపు.. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపునకు, నిర్మాణంలో అవినీతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత బుధవారం వైఎస్ షర్మిల..  జలసౌధ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఇంజినీర్ ఇన్ చీఫ్ సీ మురళీధర్ రావుకు వినతి పత్రం అందించారు. “కాంట్రాక్టర్లు నాణ్యత తనిఖీ, సరైన డిజైన్ లేకుండా పనులను అమలు చేశారు. రక్షణ గోడ కూడా సక్రమంగా నిర్మించలేదు. సుమారు రూ. లక్ష కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా సక్రమంగా సాగునీరు అందడం లేదు’’ అని షర్మిల వినతి పత్రంలో పేర్కొన్నారు. 

Also REad:వైఎస్ కుటుంబంలో విభేదాల వల్లే తెలంగాణలో షర్మిల పార్టీ.. : డీకే అరుణ

కాళేశ్వరం ఇంజినీరింగ్‌ అద్భుతమని సీఎం కేసీఆర్ చెబుతారని.. అలా అయితే అది ఎందుకు మునిగిపోయిందని ప్రశ్నించారు. ప్రాజెక్టు ముంపునకు బాధ్యలు ఎవరని ప్రశ్నల వర్షం కురపించారు. తన రక్తాన్ని, మెదడును పెట్టుబడిగా పెట్టానని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 

click me!