
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తన ఆడియోపై స్పందించారు కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి. తను ఎవరిని విమర్శించలేదని , మూడుసార్లు టికెట్ ఇవ్వకున్నా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆమె గుర్తుచేశారు. తాను ఇతర పార్టీల్లోకి వెళ్లే పరిస్థితి లేదని.. ఆ ఆడియో ఇతర పార్టీల వారి పని అని స్రవంతి ఆరోపించారు.
అంతకుముందు మునుగోడు(Munugode) నుంచి టిక్కెట్ ఆశిస్తున్న చల్లమల్ల కృష్ణారెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy)తో లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు ఓ కార్యకర్త స్రవంతికి చెబుతున్నట్లు సదరు ఆడియోలో ఉంది. అయితే కృష్ణారెడ్డికి టిక్కెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్(Huzurabad)లో వచ్చిన ఫలితాలే ఇక్కడా వస్తాయని స్రవంతి అన్నట్లుగా ఆడియో టేప్‌లో సంభాషణ సాగింది.
ALso REad:Munugode Bypoll 2022 :పట్టు 'చే'జారిపోకుండా కాంగ్రెస్ యత్నాలు,కీలక నేతలకు మండలాల బాధ్యతలు
మరోవైపు మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అభ్యర్ధి ఎంపికపై కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా పాల్వాయి స్రవంతి, చెలమల కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాష్‌లు టికెట్ రేసులో వున్నారు. టికెట్ ఆశిస్తున్న వారితో ఏఐసీసీ కార్యదర్శి బోస్‌రాజు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో స్రవంతి ఆడియో లీక్ వ్యవహారంపై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారు. కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చే ఛాన్స్ అని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
ఇకపోతే.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో తన పట్టును నిలపుకోవాలని Congress పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. పార్టీ క్యాడర్ చేజారిపోకుండా ప్రయత్నాలను ప్రారంభించింది. మండలాల వారీగా ముఖ్య నేతలకు బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అప్పగించనుంది. ఈ నెల 16 వేతదీ నుండి నియోజకవర్గంోని పలు మండలాల్లో సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మండలాల వారీగా బాధ్యతలు అప్పగించిన నేతలు ఆ మండలంలో ప్రతి గ్రామంలో పార్టీ క్యాడర్ చేజారకుండా చర్యలు తీసుకోనున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై పారటీ సీనియర్ నేత Jana Reddyతో ఎఐసీసీ సెక్రటరీ బోస్ రాజు చర్చించారు. మునుగోడు నియోజకవర్గంలో పరిస్థితిపై జానారెడ్డితో మాజీ మంత్రి Damoder Reddy చర్చించారు.