గోదావరి, శబరి నదులకు పోటెత్తిన వరద: మూడు రాష్ట్రాలకు రాకపోకలు బంద్

By narsimha lode  |  First Published Aug 10, 2022, 12:26 PM IST

భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి, శబరి నదులకు వరద పోటెత్తింది., దీంతో ఏపీ, చత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు బందయ్యాయి. భద్రాచలం సమీపంలో విలీన గ్రామాల ప్రజలు గోదావరికి వరద పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


హైదరాబాద్:భారీ వర్షాలు  కురుస్తుండడంతో Godavari , శబరి నదులకు వరద పోటెత్తుతుంది. దీంతో Telangana నుండి Andha Pradesh,చత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు బందయ్యాయి. 
గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా  గోదావరితో పాటు గోదావరి ఉప నదులకు వరద పోటెత్తింది. Bhadrachalam వద్ద గోదావరి నది క్రమంగా పెరుగుతుంది. భద్రాచలం వద్ద గోదావరి నది 51 అడుగులు దాటి ప్రవహిస్తుంది. కూనవరం వద్ద శబరి నది 47 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుంది.చింతూరు వద్ద శబరి నది 50 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుంది. 

గోదావరితో పాటు శబరి నదులకు వరద పోటెత్తడంతో  రోడ్లపైకి వరద ప్రవహిస్తుంది.  దీంతో  వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.ఎటపాక మండలం నెల్లిపాక వద్ద దగ్గర రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు బందయ్యాయి.  పోకిలేరు, కొండరాజుపేట, అన్నవరం వాగులు కూడ పొంగిపొర్లుతున్నాయి. 

Latest Videos

undefined

గోదావరి దాని ఉప నదులకు వరద పోటెత్తిన కారణంగా భద్రాచలం నుండి దుమ్ముగూడం, చర్ల, వెంకటాపురం వెళ్లే  బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు.ఏజెన్సీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.

ఈ ఏడాది జూలై మాసంలో గోదావరి నదికి వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నది 70 అడుగులు దాటింది. 1986 తర్వాత అదే స్థాయిలో వరద పోటెత్తిన విషయం తెలిసిందే. గత మాసంలో గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచలం సహా విలీన గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు భద్రాచలం పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా గోదావరి వరద నీరు చేరింది. భద్రాచలం పట్టణానికి రక్షణగా నిర్మించిన కరకట్ట వరద నీరు పట్టణంలోకి రాకుండా అడ్డుకోగలిగింది.  ఈ కరకట్ట లేకపోతే భద్రాచలం పట్టణాన్ని వరద ముంచెత్తేదని స్థానికులు గుర్తు చేస్తున్నారు.

click me!