నకిలీ ట్రాన్స్‌జెండర్ల తయారీ.. సాయంత్రం వరకు బెగ్గింగ్, ఆపై దోపిడీలు :హైదరాబాద్‌లో గ్యాంగ్ అరెస్ట్

By Siva Kodati  |  First Published Aug 19, 2023, 4:10 PM IST

రెండు రోజులుగా హైదరాబాద్ పోలీసులు చేస్తున్న దాడుల్లో బెగ్గింగ్ ముఠాల బాగోతాలు వెలుగుచూశాయి. తాజాగా ట్రాన్స్‌జెండర్ల బెగ్గింగ్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 


హైదరాబాద్‌లో భిక్షాటన చేసే వారి వెనుక మాఫియా వుండటం కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా పోలీసులు చేస్తున్న దాడుల్లో బెగ్గింగ్ ముఠాల బాగోతాలు వెలుగుచూశాయి. తాజాగా ట్రాన్స్‌జెండర్ల బెగ్గింగ్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేశ్, అనితలు నకిలీ ట్రాన్స్‌జెండర్లను తయారు చేస్తున్నట్లుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్ దగ్గర 100 మందికి పైగా నకిలీ ట్రాన్స్‌జెండర్లు వున్నట్లుగా తేలింది. రోజంతా చౌరస్తాల్లో జనాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. సాయంత్రాల్లో కాలనీలు, కమర్షియలు ఏరియాల్లో దోపిడిలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసమే నకిలీ ట్రాన్స్‌జెండర్ల అవతారం ఎత్తుతున్నారని డీసీపీ చందనదీప్తి తెలిపారు. 

రోడ్డుమీదికి వెళితే చాలు…కూడళ్లలో, బస్ స్టాప్ లో.. సిగ్నల్స్ పడిన దగ్గర.. దీనంగా చేతులు చాస్తూ వయసు పైబడిన వృద్ధులు ధర్మం కోసం వెంట పడడం కనిపిస్తుంది. ఒకసారి, రెండుసార్లు… వేసినా.. పదేపదే వెంటపడుతూ..చివరికి చిరాకు తెప్పిస్తుంటారు. అయితే ఇదంతా బెగ్గింగ్ మాఫియాగా టాస్క్ఫోర్స్ సిబ్బంది  తేల్చేసింది.  హైదరాబాదులోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ దగ్గర ఈ మాఫియాకు సంబంధించిన 29 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

Latest Videos

Also Read: హైదరాబాద్ లో బెగ్గింగ్ రాకెట్, 29మంది యాచకులు అరెస్ట్... వృద్ధులకు రోజుకు 200 కూలీ…

అరెస్ట్ చేసిన 29 మంది యాచకుల్లో బెగ్గింగ్ మాఫియా నిర్వాహకుడు అనిల్ పవార్ కూడా ఉండడం గమనార్హం.అరెస్టు చేసిన 29 మందిని రెస్కూ హోమ్ కు పోలీసులు తరలించారు. బిక్షాటన నిరోధక చట్టం కింద నిర్వాహకుడు అనిల్ పవార్ పై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అనిల్ పవర్ ను అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ బేకింగ్ మాఫియాకు సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ విధంగా  వివరాలు తెలిపారు.. వివిధ ప్రాంతాల నుంచి అనిల్ పవర్ వృద్ధులను తీసుకువచ్చి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్, పరిసర ప్రాంతాల్లో  వారితో భిక్షాటన చేయిస్తున్నాడు. 

click me!