కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యుడు వెంకటేష్ బీఆర్ఎస్ లో చేరారు.
హైదరాబాద్: ఢిల్లీ గులామ్ లకు , తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ఎవరో సన్నాసి వచ్చి ఆగం చేస్తే ఆగం కావొద్దని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు.కేసీఆర్ లాంటి నాయకుడు మనకు ఉంటేనే తెలంగాణకు శ్రీరామరక్ష అని మంత్రి చెప్పారు.కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యుడు వెంకటేష్ తన అనుచరులతో కలిసి శనివారంనాడు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారని మంత్రి ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్లు అధికారమిస్తే ఏం చేశారని ప్రశ్నించారు.
9 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసిందని ఆయన అడిగారు.2015లో గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఇప్పుడెంత అని ఆయన ప్రశ్నించారు. 2014 ముందు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను మోడీ నెరవేర్చలేదన్నారు. మతం మంటల్లో చలి కాచుకోవడమే బీజేపీ తెలుసునన్నారు. 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ కూడ ఏం చేయలేదన్నారు.తెలంగాణ వస్తే భూముల రేట్లు పడిపోతాయని చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. కల్వకుర్తిలోని తలకొండపల్లిలో భూముల రేట్లు పెరిగాయా,తగ్గాయో చెప్పాలని మంత్రి కోరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల ధరలు ఐదు రెట్లు పెరిగినట్టు మంత్రి వివరించారు.
also read:విపక్షాలకు సినిమా చూపుతాం:హైద్రాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో కేటీఆర్
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలుఅందిన విషయాన్ని మంత్రి గురు చేశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు అందని ఊరు, ఇళ్లు లేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉన్న కుంభకోణాలేనని ఆయన విమర్శించారు. సంపద సృష్టించి దోచుకోవడమే కాంగ్రెస్ నైజమని ఆయన విమర్శించారు.సంపద పెంచాలి, పేదలకు పంచాలనేది తమ పార్టీ విధానమని కేటీఆర్ చెప్పారు.దేశాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణను సాధించింది కేసీఆర్ అని ఆయన చెప్పారు.సంచులు మోసి కెమెరాల ముందు అడ్డంగా దొరికినోడు కూడ నీతులు చెబుతున్నారని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు వేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ కు 40 మంది అభ్యర్ధులు కూడ లేరని ఆయన ఎద్దేవా చేశారు. తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యుడు వెంకటేష్ ను రాష్ట్రంలో మంచి పదవిని ఇస్తానని చెప్పారు.