విషాదం.. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సూసైడ్.. ఏం జరిగిందంటే ?

By Asianet News  |  First Published Nov 20, 2023, 9:59 AM IST

నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నారు. హోల్ సేల్ కూరగాయల వ్యాపారి అయిన ఆయన.. సైబర్ నేరగాళ్లు పెట్టిన బాధలు తట్టులేక  బలవన్మరణానికి ఒడిగట్టారు.


సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిరాక్షరాస్యులనే కాదు.. చదువుకొని సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులను కూడా మోసం చేస్తున్నారు. ఫోన్ లను హ్యాక్ చేసి, బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులను కాజేస్తున్నారు. ఫలానా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఓటీపీలను పంపించి నెట్ బ్యాకింగ్, ఇతర పద్దతుల ద్వారా కష్టపడి సంపాదించిన డబ్బును కొల్లగొడుతున్నారు. కొన్ని వ్యక్తుల ఫొటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి, వాటిని సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు.

Crime News: గడ్డివాములో ప్రియుడితో భార్య సరసాలు.. సజీవంగా దహనం చేసిన భర్త: పోలీసులు 

Latest Videos

వీటిని మౌనంగా భరిస్తూ ఉండేవారు కొందరైతే, ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసే వారు మరి కొందరు. కానీ కొన్ని సార్లు సైబర్ నేరగాళ్ల పెట్టే బాధలు ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోయి బలవన్మరణానికి కూడా ఘటనలు కూడా ఎక్కువవుతున్నాయి. తాజాగా నిజామాబాద్ లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. సైబర్ నేరగాళ్ల బాధలు తట్టుకోలేక ఏకంగా ఓ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నిజామాబాద్ సిటీలోని సాయినగర్‌లో కన్నయ్య గౌడ్ అనే హోల్ సేల్ కూరగాయల వ్యాపారి జీవిస్తున్నారు. కొంత కాలం కిందట తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. దీంతో అలయెన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ పార్టీ తరఫున కన్నయ్య గౌడ్ నిజామాబాద్ అర్భన్ స్థానం నుంచి బరిలోకి దిగారు.

Cargo Ship: ఇండియాకు వస్తున్న కార్గో షిప్‌ హైజాక్.. ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల చర్య

అయితే ఇటీవల కన్నయ్య గౌడ్ ఫోన్ ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఆయన ఫోటోలను తీసుకొని వాటిని మార్ఫింగ్ చేశారు. వాటితో అశ్లీల వీడియోలు రూపొందించారు. అనంతరం ఆ వీడియోలను ఆయన ఫోన్ కు పంపించారు. వాటి ఆధారంగా డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన ఎవరికీ చెప్పుకోలేకపోయారు. తీవ్ర మనస్థాపానికి, భయంతో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.

Maharashtra: భర్త ఉక్రెయిన్‌కు వెళ్లిపోయాడని భార్య ఆత్మహత్య.. అసలు కారణం ఇదీ

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

click me!