విహారయాత్రలో విషాదం.. నీట మునిగి ముగ్గురు మృతి

Published : May 05, 2023, 05:12 AM IST
విహారయాత్రలో విషాదం.. నీట మునిగి ముగ్గురు మృతి

సారాంశం

Hyderabad: ఈత‌కు వెళ్లి ముగ్గ‌రు యువ‌కులు ప్ర‌మాద‌వ‌శాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికంగా ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ముగ్గురు సామలపల్లి గ్రామ స‌మీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌మాద‌వ‌శాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.   

3 from Hyderabad’s Yakutpura drown in Siddipet: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూరు చెరువుకు విహారయాత్రకు వెళ్లిన పాతబస్తీ యాకుత్ పురాకు చెందిన ఓ చిన్నారితో సహా ముగ్గురు సెల్ఫీ తీసుకుంటూ నీట మునిగి చనిపోయారు. 

వర్గల్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈత‌కు వెళ్లి ముగ్గ‌రు యువ‌కులు ప్ర‌మాద‌వ‌శాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికంగా ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఈత నేర్చుకోవడానికి సామలపల్లి గ్రామ స‌మీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌మాద‌వ‌శాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నగరంలోని యాకుత్ పురాకు చెందిన షేక్ ఖైసర్ (26), అతని మేనల్లుడు షేక్ ముస్తఫా (03), అతని బంధువు మహ్మద్ సోహైల్ (17) కుటుంబ సభ్యులతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాసాన్ పల్లిలోని మక్తాకు వచ్చారు.

నెంటూరు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లిన ఖైసర్ తన మొబైల్ ఫోన్ తో సెల్ఫీ తీసుకునేందుకు ముస్తఫాను తీసుకుని చెరువులోకి దిగాడు. ఇద్దరూ నీటిలో జారిపోవడంతో సోహైల్ వారిని రక్షించే ప్రయత్నం చేయగా ముగ్గురూ మునిగిపోయారని వర్గల్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.

సంగారెడ్డిలోని చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

సంగారెడ్డి మండలం కలాబ్ గూర్ గ్రామంలోని మొగుళ్ల చెరువు చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 35 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి నల్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించాడు. మృతదేహం సుమారు పక్షం రోజుల నాటిదని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu
Traffic Rules: ఫైన్ ప‌డిన వెంట‌నే బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్‌.. సీఎం సంచలన ప్ర‌క‌ట‌న