అనుచరులతో చర్చించి చెబుతాం: బీజేపీలో చేరికపై తేల్చని జూపల్లి, పొంగులేటి

By narsimha lode  |  First Published May 4, 2023, 5:15 PM IST

బీజేపీలో  చేరే విషయమై  బీజేపీ  నేతలకు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు స్పష్టత ఇవ్వలేదు


:ఖమ్మం: బీజేపీలో  చేరే విషయమై మాజీ  మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు స్పష్టత ఇవ్వలేదు. తమ అనుచరులతో చర్చించిన  తర్వాత స్పష్టత ఇస్తామని  ఈ ఇద్దరు నేతలు  బీజేపీ బృందానికి  చెప్పారని సమాచారం.  

గురువారం నాడు ఉదయం ఖమ్మంలో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,జూపల్లి కృష్ణారావులతో  ఈటల రాజేందర్ నేతృత్వంలోని బీజేపీ నేతలు  సమావేశమయ్యారు. బీజేపీలో  చేరాలని  ఈటల రాజేందర్   ఆధ్వానించారు.  అయితే  పార్టీలో చేరే విషయమై  జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు  స్పష్టత ఇవ్వలేదు. అందరం కలిసి  పోరాటం చేస్తే  బీఆర్ఎస్ ను   అధికారం నుండి తప్పించవచ్చని  ఈటల రాజేందర్  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  జూపల్లి కృష్ణారావులకు  చెప్పారు. అయితే  పార్టీలో  చేరే విషయమై ఇప్పటికిప్పుడు హామీ ఇవ్వలేమని  ఈ ఇద్దరు నేతలు  చెప్పారని సమాచారం. 

Latest Videos

also read:పొంగులేటి, జూపల్లితో ఈటల బృందం భేటీ: బీజేపీలో చేరాలని ఆహ్వానం

కర్ణాటక అసెంబ్లీ  ఎన్నికల తర్వాత  ఏ పార్టీలో  చేరే విషయమై  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.  మరో వైపు  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాదయాత్రకు  కూడా సన్నాహలు  చేసుకుంటున్నారు. గత నెల  10వ తేదీన  బీఆర్ఎస్ నుండి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  జూపల్లి కృష్ణారావులు సస్పెన్షన్ కు గురయ్యారు.  దీంతో  ఈ ఇద్దరు నేతలకు  కాంగ్రెస్, బీజేపీ నేతలు  గాలం వేస్తున్నార. అయితే  ఈ  ఇద్దరు నేతలు  ఏ పార్టీలో చేరే విషయమై  ఇంకా స్పష్టత ఇవ్వలేదు.  రెండు  మూడు  రోజుల్లో కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఇద్దరితో చర్చించే అవకాశాలు కూడా లేకపోలేదు.  


 


 

click me!