చెరువులో మునిగి నలుగురు మరణించిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. మొదట ముగ్గురు పిల్లలు నీట మునిగిపోతుండగా.. వారిని కాపాడేందుకు మహిళ వెళ్లారు. వారిని కాపాడే క్రమంలో ఆ మహిళ కూడా చెరువులో మునిగి చనిపోయారు.
తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి నలుగురు చనిపోయారు. ఇందులో ముగ్గురు పిల్లలు కాగా.. మరొకరు 28 ఏళ్ల మహిళ. ఈ ఘటన జిల్లాలో విషాదాన్ని నింపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ సంపద ఎంతో తెలుసా ? దరిదాపుల్లో లేని సొంత పార్టీ నేతలు
వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట మండలం బోయిన్‌పల్లి అనే గ్రామంలో సురేఖ (28) మేకలు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. ఎఫ్పటిలాగే మంగళవారం కూడా ఆమె మేకలు మేపేందుకు వెళ్లారు. అయితే ఆమె వెంట 8 ఏళ్ల కుమారుడు విజయ్, 11 ఏళ్ల అక్క కూతురు లిఖిత, పక్కింట్లో నివసించే నర్సప్ప 8 ఏళ్ల కొడుకు వెంకటేష్ కూడా వెళ్లారు.
గ్రామానికి దగ్గర్లలో ఉన్న పచ్చిక బయళ్లలో సురేఖ మేకలు కాస్తుండగా.. పిల్లలు ముగ్గురు కూడా పక్కనే ఉన్న చెరువులో దిగి సరదాగా ఈత కొట్టడం ప్రారంభించారు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో వారంతా మునిగిపోయారు. వీరిని గమనించి సురేఖ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చెరువులోకి వెళ్లారు. పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించారు. ముగ్గురు పిల్లలు ఆమెను పట్టుకోవడంతో సురేఖ కూడా నీటిలో మునిగిపోయారు. దీంతో నలుగురు కూడా నీట మునిగారు.
ఇక మాఫియా ఎవరినీ భయపెట్టదు - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఈ ఘటనను గమనించిన ఓ బాలిక ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లింది. గ్రామస్తులకు జరిగింది చెప్పింది. దీంతో స్థానికులు అంతా చెరువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. కొందరు చెరువులోకి దూకి నలుగురుని వెలికి తీశారు. కానీ అప్పటికే వారంతా మరణించారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కూడా మూడు రోజుల కిందట ఇలాంటి ఘటనే జరిగింది. పెన్ గంగాలో పడి సిర్పూర్ - టి లోని హుడ్కి గ్రామానికి చెందిన యువకుడు మరణించాడు. గ్రామానికి చెందిన 25 ఏళ్ల చౌదరి కైలాస్ కొంత కాలం నుంచి మతిస్థిమితం బాగా లేదు. దీంతో పాటు ఆయనకు అప్పుడప్పుడు ఫిట్స్ కూడా వస్తుంటాయి. అయితే ఈ నెల 15వ తేదీన ఆయన పెన్ గంగాను ఆనుకొని ఉన్న చేన్లోకి వెళ్లారు. కానీ చీకటి పడినా తిరిగి ఇంటికి రాలేదు.
కర్ణాటకలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా ఎవరూ అడ్డుకోలేరు - యడియూరప్ప
దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చేన్లో, పెన్ గంగా పరిసరాల్లో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆదివారం పెన్ గంగా నది ఒడ్డున చెప్పులు కనిపించాయి. దీంతో నదిలో గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. కొంత సమయం తరువాత కైలాస్ మృతదేహం లభించింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.