జైలు నుంచి విడుదలైన తీన్మార్ మల్లన్న .. కొత్త పార్టీ ప్రకటన, వచ్చే ఎన్నికల్లో పోటీ ఎక్కడంటే..?

By Siva KodatiFirst Published Apr 18, 2023, 9:44 PM IST
Highlights

సీనియర్ జర్నలిస్ట్ , క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు.

సీనియర్ జర్నలిస్ట్ , క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రకటన చేశారు. తాను త్వరలో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ పేరు ‘‘తెలంగాణ నిర్మాణ పార్టీ’’ అని వెల్లడించారు. ఈ పేరును ఇప్పటికే రిజిస్టర్ చేయించానని, వచ్చే ఎన్నికల్లో మేడ్చల్ నుంచి పోటీ చేస్తానని తీన్మార్ మల్లన్న తెలిపారు. సీఎం కేసీఆర్ పోలీస్  సెక్షన్లను పెట్టుకుని తనలాంటి వాడిని అరెస్ట్ చేయించారని.. తాను కూడా వీకర్ సెక్షన్‌తో ముందుకు వెళ్తానని ఆయన చెప్పారు. కేసీఆర్ కేబినెట్‌లో అర్హత లేని వారు కూడా మంత్రులుగా కొనసాగుతున్నారని మల్లన్న ఎద్దేవా చేశారు. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ ప్రశ్నించడంపై తీన్మార్ మల్లన్న ఇటీవల తన ఛానెల్‌లో వీడియో క్లిప్‌ను అప్‌లోడ్ చేశాడు. అయితే ఆ వీడియోపై బీఆర్ఎస్ శ్రేణులు  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గత నెలలో తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీసుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇందుకు సంబంధించి తీన్మార్ మల్లన్న పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య క్యూ న్యూస్ ఆఫీసులో సోదాలు నిర్వహించిన పోలీసులు.. అనంతరం తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు. 

click me!