కొమురం భీం జిల్లాలో విషాదం.. జన్మించిన రెండు రోజులకే కుమారుడు మృతి... తట్టుకోలేక తల్లి కూడా..

By team teluguFirst Published Jan 10, 2023, 7:52 AM IST
Highlights

కొమురం భీం జిల్లాలో విషాదం నెలకొంది. ఒకే రోజు తల్లీబిడ్డలు చనిపోయారు. జన్మించిన రెండు రోజులకే కుమారుడు మరణించడంతో ఆ తల్లి తట్టుకోలేక గుండెలు విలపించేలా రోదిస్తూ కన్నుమూసింది. 

ఆ తల్లి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ తల్లీ, బిడ్డల ఆరోగ్యం బలహీనంగా ఉండటంతో వారిని వేరు వేరే హాస్పిటల్ లో చేర్చారు. అయితే రెండు రోజుల తరువాత ఆ బాలుడు మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి తట్టుకోలేకపోయింది. తీవ్రంగా రోదిస్తూ గంటల వ్యవధిలోనే ఆమె కూడా కన్నుమూసింది. ఈ విషాద ఘటన కుమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. 

నిర్మల్‌లో రాష్ట్ర స్థాయి సైన్స్‌ ఫెయిర్‌ ప్రారంభం.. హాజరైన మంత్రలు సబితా, ఇంద్రకరణ్ రెడ్డి

వివరాలు ఇలా ఉన్నాయి. చింతలమానెపల్లి మండలంలోని గూడెం గ్రామంలో శ్రీనివాస్‌, శోభ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇది వరకే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. గత సంవత్సరం వీరికి మరో కూతురు జన్మించింది. అయితే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆ శిశువు చనిపోయింది. మరో సారి శోభ గర్భం దాల్చింది. తొమ్మిది నెలలు పూర్తవడంతో ఆమె పెంచికల్ పేట్ లోని గవర్నమెంట్ ప్రైమెరీ హెల్త్ కేర్ సెంటర్ కు వెళ్లింది. అక్కడ డాక్టర్లు ఆమెకు పలు పరీక్షలు నిర్వహించారు. తరువాత ఆమె ఇంటికి వచ్చింది.

జనవరి 19న తెలంగాణకు ప్రధాని మోడీ.. రూ.7,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన

శుక్రవారం శోభకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. అందులో గర్భిణిని కౌటాలలో ఉన్న సీహెచ్ సీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ మార్గ మధ్యలోనే ఆమె మగ శిశువును ప్రసవించింది. తరువాత హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది గంటల సమయం పట్టించుకోలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. 

ప్ర‌భుత్వం తీరుతో రాష్ట్రంలో 60 మంది సర్పంచుల ఆత్మహత్య.. : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి

చాలా సమయం వేచి ఉన్న తరువాత డాక్టర్లు వచ్చారు. బ్లీడింగ్ ఎక్కువగా అవుతోందని, వెంటనే కాగజ్ నగర్ లోని హాస్పిటల్ కు తీసుకెళ్లాలని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కాగజ్‌నగర్‌ లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు శిశువును, తల్లిని పరీక్షించారు. ఇద్దరి ఆరోగ్యం బాగా లేదని, మంచిర్యాలలోని హాస్పిటల్ లో చేర్పించాలని తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు శిశువును కాగజ్‌నగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో, తల్లి శోభను మంచిర్యాలలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లి జాయిన్ చేశారు. 

కంటెంట్ ఉన్న లీడర్ సక్సెస్ అవుతాడు: కేటీఆర్

అయితే శిశువు పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి కన్నుమూశాడు. ఈ సమాచారం తల్లికి చేరింది. దీంతో ఆమె తీవ్రంగా రోదించింది. కుమారుడి మరణాన్ని తట్టుకోలేకపోయింది. అలా రోదిస్తూనే ఆమె మరణించింది. తల్లీబిడ్డల ఇద్దరికి స్వగ్రామంలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో గ్రామం ఒక్క సారిగా మూగబోయింది. 

click me!