Basara: బాసరలో విషాదం.. అమ్మవారి దర్శనానికి వెళ్లి గోదారిలో మునిగి ఐదురుగు మృతి

Published : Jun 15, 2025, 03:36 PM IST
Godavari river in Andhra

సారాంశం

Tragedy in Basara: బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వెళ్లిన హైదరాబాద్‌లోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు యువకులు గోదావరిలో స్నానం చేస్తుండగా మునిగి మృతి చెందారు.

Tragedy in Basara: నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమ్మవార దర్శనం కోసం వచ్చి ఆదివారం ఐదురుగు గోదారిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. పుణ్యస్నానాల కోసం గోదావరి నదిలో దిగిన ఐదుగురు యువకులు నీటిలో మునిగి మరణించారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనతో బాసరతో పాటు దిల్‌సుఖ్‌నగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ కుటుంబం మొత్తం 18 మంది సభ్యులతో కలిసి బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. దర్శన అనంతరం వారు గోదావరి నదిలో పుణ్యస్నానానికి బోటు ద్వారా నది మధ్యలోకి వెళ్లారు. ఆ సమయంలో గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, ఇసుక మెటల సమీపంలో లోతు పెరగడం వల్ల ఐదుగురు యువకులు నీటిలో మునిగిపోయారు.

మృతులను రాకేష్ (17), వినోద్ (18), మదన్ (18), రితిక్‌గా గుర్తించారు. మరో యువకుడు భరత్ గల్లంతయ్యాడు. అతని కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మొత్తం నలుగురి మృతదేహాలను వెలికితీసి, భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటన స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీఐ మల్లేశ్‌, ఎస్సై శ్రీనివాస్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఈ విషాద ఘటన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి వెళ్లిన కుటుంబానికి ఇది ఒక దురదృష్టకర యాత్రగా మిగిలింది.

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌