తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం..రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే రూట్లలో అంటే..?

Siva Kodati |  
Published : Apr 29, 2023, 03:14 PM ISTUpdated : Apr 29, 2023, 03:15 PM IST
తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం..రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే రూట్లలో అంటే..?

సారాంశం

తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో రేపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలు వుంటాయని పోలీసులు తెలిపారు. నగర ప్రజలు సహకరించాలని కోరారు.   

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమైంది. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్‌ను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి రాత్రి 8 గంటల వరకు హుస్సేన్ సాగర్, సైఫాబాద్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు వుంటాయని నగర ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్క్, నెక్లెస్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నామని.. అలాగే వీఐపీల రాకపోకల సందర్భంగా పీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వరకు ట్రాఫిక్‌ను నిలిపివేయడం, మళ్లింపులు వుంటాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి అనుమతి లేదని పేర్కొన్నారు. లోయర్ ట్యాంక్ బండ్, కవాడిగూడ మీదుగా ఆర్టీసీ బస్సులను మళ్లిస్తామని సీపీ చెప్పారు. ఆహ్వానితులు తమ పాస్‌లను కార్లకు అతికించుకోవాలని.. వీరి కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు సురేంద్రబాబు తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. ప్రారంభోత్సవానికి సంబంధించి కార్యక్రమాల షెడ్యూల్‌ను విడుదలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. తొలుత ఉదయం 6 గంటలకు సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ యాగంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 గంటల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం చేయనున్నారు. ఆ తర్వాత నూతన సచివాలయాల ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతులపై జరుగనున్నది. ఆ     తరువాత నేరుగా 6వ అంతస్తులో వున్న తన ఛాంబర్‌లో సీఎం కేసీఆర్ అడుగుపెట్టనున్నారు. మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 గంటల మధ్య అధికారులు తమతమ చాంబర్లలో అడుగుపెడుతారు. ఈ సమయంలోనే ఒక ఫైల్ మీద సంతకం చేయాలని సాధారణ పరిపాలన శాఖ నుంచి మంత్రులు, అధికారులకు ఆదేశాలు వచ్చాయట. అనంతరం 2.15 నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రసంగం ఉండనున్నది.

ALso Read: నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి సంతకం ఏ ఫైల్ పైనా?

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న  ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ వోడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మున్సిపల్ మేయర్లు తదితరులు  పాల్గొంటార‌ని స‌మాచారం. ఈ కార్యక్రమానికి సుమారు 2500 మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కొత్త సచివాలయంలో పలు భద్రతా చర్యలు చేపట్టారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu