
హైదరాబాద్ : బిజెపి నేత చక్రధర్ గౌడ్ దంపతులు కిడ్నాప్ అయ్యారు. నిన్న సాయంత్రం పంజాగుట్టలో చక్రధర్ గౌడ్ కార్యాలయ తలుపులు పగలగొట్టి మరి భార్యభర్తలను బలవంతంగా తీసుకెళ్లారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. గతంలో బెంగుళూరు ఉద్యోగాలు ఇప్పిస్తామని పెద్దమొత్తంలో ఈ దంపతులు డబ్బులు వసూలు చేశారు.
చక్రధర్ గౌడ్ దంపతులు ఫేక్ అకౌంట్లు, ఫేక్ సిమ్ కార్డులతో యువతను బురిడీ కొట్టించారు. నిన్న సాయంత్రం వారిని తీసుకువెళ్లినా ఇంతవరకు చక్రధర్ గౌడ్, ఆరోషిక రెడ్డి జాడ తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.