గణతంత్ర దినోత్సవం సందర్భంగా .. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Published : Jan 25, 2021, 08:54 AM ISTUpdated : Jan 25, 2021, 09:01 AM IST
గణతంత్ర దినోత్సవం సందర్భంగా .. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

సారాంశం

హైదరాబాద్ లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో... పబ్లిక్‌ గార్డెన్స్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.   

దేశవ్యాప్తంగా రేపు గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో.... రేపు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో... పబ్లిక్‌ గార్డెన్స్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. 

ఈ ఆంక్షలు 26 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమల్లో ఉంటాయని సీపీ అంజనీ కుమార్‌ వెల్లడించారు. మొజంజాహి మార్కెట్‌ తాజ్‌ ఐల్యాండ్‌, చాపెల్‌ రోడ్డు టీ జంక్షన్‌, సైఫాబాద్‌ పాత పీఎస్‌, బషీర్‌బాగ్‌ జంక్షన్‌, ఇక్బాల్‌ మీనార్‌, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌, ఆదర్శ్‌నగర్ ‌(న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌) వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. ట్రాఫిక్‌ అధికారులు, సిబ్బంది సూచించిన మార్గాల్లో ప్రయాణించి ట్రాఫిక్‌ సాఫీగా సాగేలా ప్రజలు సహకరించాలని సీపీ కోరారు.
 

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు