గిరిజనులతో కాలు కదిపిన మంత్రి సత్యవతి రాథోడ్

By Siva KodatiFirst Published Jan 24, 2021, 9:19 PM IST
Highlights

తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజనులతో కలిసి ఆడిపాడారు. ఆదివారం వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో ‘బంజారా గోత్రాల క్యాలెండర్-2021’ మంత్రి ఆవిష్కరించారు.

తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజనులతో కలిసి ఆడిపాడారు. ఆదివారం వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో ‘బంజారా గోత్రాల క్యాలెండర్-2021’ మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వాలు చేయనన్ని కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే గిరిజన తండాలు గ్రామపంచాయతీలుగా మారి.. లంబాడీల స్వయం పాలన కిందకు వచ్చాయని సత్యవతి గుర్తుచేశారు.

అక్కడక్కడ గిరిజనుల పట్ల దాడులు జరగడం దురదృష్టకరమని, వీటిని నిరోధించేందుకు ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు వాటిని అందించేందుకు కృషి చేయాలని సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, బంజారా నేతలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి సత్యవతి వేసిన గిరిజన నృత్యం పలువురిని ఆకట్టుకుంది

click me!