మానవత్వం: అవ్వను రోడ్డును దాటించి.. ఆటోలో క్షేమంగా పంపిన ట్రాఫిక్ పోలీస్

Siva Kodati |  
Published : Apr 03, 2021, 04:41 PM IST
మానవత్వం: అవ్వను రోడ్డును దాటించి.. ఆటోలో క్షేమంగా పంపిన ట్రాఫిక్ పోలీస్

సారాంశం

విధి నిర్వహణతో పాటు సమాజ సేవలోనూ తాము ముందుంటామని పోలీసులు నిరూపించారు. ఈ నేపథ్యంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన మానవత్వం చాటుకున్నాడు . మండుటెండలో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలికి సహాయం చేశాడు.

విధి నిర్వహణతో పాటు సమాజ సేవలోనూ తాము ముందుంటామని పోలీసులు నిరూపించారు. ఈ నేపథ్యంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన మానవత్వం చాటుకున్నాడు .

మండుటెండలో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలికి సహాయం చేశాడు. గోదావరిఖని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద ఎండలో రోడ్డు దాటేందుకు అవ్వ ఇబ్బంది పడుతోంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న లింగమూర్తి అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆమెను గమనించాడు.

వెంటనే అవ్వని రోడ్డు దాటించి.. ఎక్కడకి వెళ్లాలి అని అడిగాడు. ఆమె ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్ళాలి అని చెప్పగా ఆటోలో ఎక్కించి పంపించాడు. వెళుతూ వెళుతూ.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు ధన్యవాదాలు చెప్పింది ఆ వృద్ధురాలు.
 

PREV
click me!

Recommended Stories

Farmers Scheme : తెలుగు రైతులకు బంపర్ ఆఫర్.. అకౌంట్లోకి నేరుగా రూ.30,000, సర్కార్ సూపర్ స్కీమ్
Flood Alert : ఏపీలో భారీ వర్షాలే లేవు, అయినా పొంచివున్న వరద ముప్పు.. ఈ ప్రాంతాల్లో ఇక అల్లకల్లోలమే