మహిళ ఎత్తు: లో దుస్తుల్లో బంగారపు ఉండలు.. పట్టేసిన కస్టమ్స్

By Siva KodatiFirst Published Apr 3, 2021, 4:40 PM IST
Highlights

దేశంలోని విమానాశ్రయాల్లో నిఘా ఎక్కువ కావడంతో స్మగర్లు బంగారాన్ని సరిహద్దులు దాటించేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే కస్టమ్స్ అధికారులు ఇంకా తెలివైన వారు కావడంతో వారు అడ్డంగా దొరికిపోతున్నారు.

దేశంలోని విమానాశ్రయాల్లో నిఘా ఎక్కువ కావడంతో స్మగర్లు బంగారాన్ని సరిహద్దులు దాటించేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే కస్టమ్స్ అధికారులు ఇంకా తెలివైన వారు కావడంతో వారు అడ్డంగా దొరికిపోతున్నారు.

తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ఓ మహిళ నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.

ఎయిర్‌ అరేబియా విమానం జీ–9458లో షార్జా నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఓ మహిళ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన కస్టమ్స్‌ అధికారులు సదరు మహిళను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా లో దుస్తుల్లో బంగారం పేస్టుతో వున్న రెండు ఉండలను గుర్తించారు. 548 గ్రాముల బరువు గల ఈ బంగారం విలువ రూ.25.4 లక్షలు ఉంటుందని అంచనా. ఆ మహిళను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇక మరో కేసులో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా విదేశీ కరెన్సీ తీసుకెళుతూ పట్టుబడ్డాడు. శుక్రవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి జి–9541 విమానంలో షార్జా వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా వున్నాయి.

దీంతో అతనిని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతని బ్యాగేజీలో యూఎస్, ఒమన్, యుఏఈ దేశాలకు చెందిన కరెన్సీ బయటపడింది ఆ నగదు విలువ (భారత కరెన్సీలో రూ.8.4 లక్షలు) వుంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతనిపై ఫెమా చట్టం కింద కేసు నమోదు చేశారు. 

click me!