Telangana Formation Day: తెలంగాణ అవతరణ దినోత్సవం.. పలు మార్గాల్లో ఆంక్షలు.. పూర్తి ట్రాఫిక్ అడ్వైజరీ ఇదిగో

Published : May 31, 2025, 11:19 PM IST
Traffic diversions in Hyderabad on June 2 for Telangana Formation Day

సారాంశం

Telangana Formation Day: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల నేపథ్యంలో జూన్ 2న హైదరాబాద్‌లో కీలక మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.

Telangana Formation Day: తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ పలు ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులను అమలు చేయనుంది. ఈ వేడుకలు నాంపల్లి గన్ పార్క్‌, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.

గన్ పార్క్, నాంపల్లి వద్ద ట్రాఫిక్ మళ్లింపులు

జూన్ 2న ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు గన్ పార్క్ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయి.

• ద్వారక హోటల్, సైఫాబాద్ నుండి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ వైపు వెళ్ళే వాహనాలు అనుమతించరు. వీటిని రవీంద్ర భారతి వద్ద నుండి ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్లించనున్నారు.

• నాంపల్లి టీ జంక్షన్ నుండి రవీంద్ర భారతి వైపు వెళ్ళే వాహనాలు ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద నుండి బీజేఆర్ విగ్రహం వైపు మళ్లించనున్నారు.

పరేడ్ గ్రౌండ్స్ వద్ద ట్రాఫిక్ మళ్లింపులు

జూన్ 2న ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లో ఉంటాయి.

• పంజాగుట్ట, గ్రీన్‌లాండ్స్, బేగంపేట్ నుండి సికింద్రాబాద్ వైపు రాకపోకలకు పౌరులు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.

• టివోలీ X రోడ్స్ నుండి ప్లాజా X రోడ్స్ మధ్య రహదారి పూర్తిగా మూసివేయనున్నారు.

హైదరాబాద్ లోని ముఖ్యమైన ట్రాఫిక్ మళ్లింపులు

1. బేగంపేట్ నుండి సంగీత్ X రోడ్స్ వైపు వెళ్ళే వాహనాలు CTO X రోడ్స్ వద్ద నుండి బాలంరాయి, బ్రూక్ బాండ్, టివోలీ, స్వీకార్ ఉపకార్, YMCA, సెయింట్ జాన్స్ రోటరీ మీదుగా సంగీత్ X రోడ్స్ వైపు మళ్లించనున్నారు.

2. బోయిన్‌పల్లి, తాడ్బండ్, టివోలీ నుండి ప్లాజా వైపు వెళ్ళే వాహనాలు టివోలీ, స్వీకార్ ఉపకార్, YMCA, సెయింట్ జాన్స్ రోటరీ మీదుగా మళ్లించనున్నారు.

3. ప్యాట్ని నుండి తిరుమలగిరి వైపు వెళ్తున్న వాహనాలు YMCA, స్వీకార్ ఉపకార్, పికెట్ మీదుగా మళ్లించనున్నారు.

4. సంగీత్ X రోడ్స్ నుండి బేగంపేట్ వైపు వెళ్తున్న వాహనాలు YMCA వద్ద నుండి క్లాక్ టవర్, ప్యాట్ని, ప్యారడైజ్, CTO, రసూల్‌పురా మీదుగా మళ్లించనున్నారు.

5. అలుగడ్డబాయి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సంగీత్ X రోడ్స్ వైపు వెళ్తున్న వాహనాలు క్లాక్ టవర్, ప్యాట్ని, ప్యారడైజ్ మీదుగా మళ్లించనున్నారు.

6. బోయిన్‌పల్లి, తాడ్బండ్ నుండి టివోలీ వైపు వెళ్తున్న వాహనాలు బ్రూక్ బాండ్, CTO, రాణిగంజ్, ట్యాంక్ బండ్ మీదుగా మళ్లించనున్నారు.

7. కార్ఖానా, జేబీఎస్ నుండి SBI ప్యాట్ని వైపు వెళ్తున్న వాహనాలు స్వీకార్ ఉపకార్ నుండి YMCA, క్లాక్ టవర్, ప్యాట్ని లేదా టివోలీ, బ్రూక్ బాండ్, బాలంరాయి, CTO వైపు మళ్లించనున్నారు.

8. తిరుమలగిరి RTA, కార్ఖానా నుండి ప్లాజా వైపు వెళ్తున్న వాహనాలు టివోలీ వద్ద నుండి స్వీకార్ ఉపకార్, YMCA లేదా బ్రూక్ బాండ్, బాలంరాయి, CTO వైపు మళ్లించనున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు బోయిన్‌పల్లి మార్కెట్, AOC వైపు మళ్లింపులు జరగవచ్చు.

ట్రాఫిక్ రద్దీ పాయింట్లు:

చిలకలగూడ X రోడ్స్, అలుగడ్డబాయి X రోడ్స్, సంగీత్ X రోడ్స్, YMCA X రోడ్స్, ప్యాట్ని X రోడ్స్, SBH X రోడ్స్, ప్లాజా, CTO జంక్షన్, బ్రూక్ బాండ్, టివోలీ, స్వీకార్ ఉపకార్, సికింద్రాబాద్ క్లబ్, తిరుమలగిరి X రోడ్స్, తాడ్బండ్ X రోడ్స్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోయిన్‌పల్లి X రోడ్స్, రసూల్‌పురా, బేగంపేట్, ప్యారడైజ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

ప్రజలకు పోలీసుల సూచనలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్‌కు వెళ్ళే వారు ముందుగానే ప్రయాణం ప్రారంభించాలని, మెట్రో రైల్ సేవలను వినియోగించుకోవాలని హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

అవతరణ దినోత్సవానికి హాజరయ్యే జిల్లా బస్సులు, ప్రజలు కేటాయించిన పార్కింగ్ స్థలాలలో మాత్రమే వాహనాలను పార్క్ చేయాలని సూచించారు.

ఇంకా తాజా ట్రాఫిక్ సమాచారం కోసం ట్రాఫిక్ పోలీసులు అధికారిక సోషల్ మీడియా పేజీలు ఫేస్ బుక్ (facebook.com/HYDTP), ఎక్స్ (X@HYDTP) ద్వారా అప్డేట్స్ అందిస్తారు. అత్యవసరాలు లేదా ట్రావెల్ సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించవచ్చు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?