కేటీఆర్ ఓ దద్దమ్మ... రేవంత్ ను చూస్తేనే లాగులు తడుస్తున్నాయి: టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సీరియస్

Arun Kumar P   | Asianet News
Published : Oct 06, 2021, 10:30 AM ISTUpdated : Oct 06, 2021, 10:58 AM IST
కేటీఆర్ ఓ దద్దమ్మ... రేవంత్ ను చూస్తేనే లాగులు తడుస్తున్నాయి: టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సీరియస్

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని చూస్తేనే టీఆర్ఎస్ వాళ్ల లాగులు తడుస్తున్నాయని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు కేటీఆర్ కు లేదని టిపిసిసి కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా చేయాలన్న సదుద్దేశంతో రేవంత్ వైట్ ఛాలెంజ్ విసిరితే తప్పించుకుని పారిపోయిన దద్దమ్మ ఈ మంత్రి కేటీఆర్. అలాంటిది Revanth Reddyని విమర్శించేంతటి వాడా అంటూ KTR పై mahesh goud మండిపడ్డారు.  

కాంగ్రెస్ కు దిక్కులేక ఇతరపార్టీ నుండి తెచ్చుకుని రేవంత్ ను అధ్యక్షున్ని చేశారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మహేష్ గౌడ్ కౌంటరిచ్చారు. సీఎం కేసీఆర్ తో సహా గుత్తా సుఖేందర్, గంగుల కమలాకర్.  ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ వంటివారంతా ఎక్కడినుండి వచ్చారు? వీరంతా ఇతరపార్టీల నుండి పదవులు అనుభవిస్తున్నవారే కదా అని అన్నారు.  ఇప్పుడున్న టీఆర్ఎస్ పసుపు గులాబీ పార్టీ కాదా అంటూ మహేష్ గౌడ్ ఎద్దేవా చేశారు. 

read more  లఖీంపూర్ ఖేరీ హింస.. బాధిత రైతు కుటుంబాలకు టీపీసీసీ తరపున ఆర్ధిక సాయం: రేవంత్ రెడ్డి ప్రకటన

తెలంగాణ రాష్ట్రానికి అసలైన ద్రోహులు ఎవరైనా వున్నారంటే అది కేసీఆర్ కుటుంబమేనని అన్నారు. అందువల్లే ఉద్యమ వీరుడైన రేవంత్ ను చూస్తే టీఆర్ఎస్ నేతలను లాగులు తడుస్తున్నాయని మహేష్ గౌడ్ మండిపడ్డారు. 

తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ చేతికి వచ్చాక పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని కాంగ్రెస్ శ్రేణులు దూకుడుగా ముందుుకు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే మహేష్ గౌడ్ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొడుతూ కౌంటర్ ఎటాక్ చేశారు.  
 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu