ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు కారును ఢీకొని లోయలోకి దూసుకెళ్లి డ్రైవర్ మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు కారును ఢీకొని లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన కారు డ్రైవర్ తాటి వినీత్(22) అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే కండక్టర్ సహా ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు.
మంథని-కాటారం ప్రధాన రహదారి గాడుదల గండిగుట్ట వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు పరకాల డిపోకు చెందింది. ప్రమాదానికి గురైన బస్సు బెల్లంపల్లి నుంచి హన్మకొండకు వెళ్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
undefined
read more హైదరాబాద్: గూగుల్ సిగ్నల్ వద్ద బైక్‌పై దూసుకెళ్లిన కారు ... యువతి మృతి
read more రోడ్డు ప్రమాదం.. మామ, కోడలు దుర్మరణం..!
వీడియో
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆర్టిసి అధికారులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
read more Hyderabad Accident:మాదాపూర్ లో బైక్ యాక్సిడెంట్... యువకుడి మృతి, సోదరుడికి గాయాలు