సీనియర్లు లేని లోటు కన్పిస్తోంది:టీపీసీసీ మీటింగ్‌లపై జగ్గారెడ్డి

Published : Aug 30, 2021, 08:36 PM IST
సీనియర్లు లేని లోటు కన్పిస్తోంది:టీపీసీసీ మీటింగ్‌లపై జగ్గారెడ్డి

సారాంశం

తెలంగాణ పీసీసీ సమావేశాలకు సీనియర్లు లేని లోటు కన్పిస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు. టీపీసీసీ సమావేశానికి  పార్టీ సీనియర్లు  జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , రాజగోపాల్ రెడ్డి, వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డిలు హాజరు కావడం లేదన్నారు.  

హైదరాబాద్: టీపీసీసీ సమావేశానికి సీనియర్లు  లేని లోటు కన్పిస్తోందని  ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  చెప్పారు.
సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ సమావేశానికి  పార్టీ సీనియర్లు  జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , రాజగోపాల్ రెడ్డి, వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డిలు హాజరు కావడం లేదన్నారు.

also read:హుజూరాబాద్ బైపోల్‌‌లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధి: ఆ ముగ్గురి నిర్ణయం తర్వాతే ఫైనల్

ఈ లోపాన్ని టీపీసీసీ సరిదిద్దుకొనే ప్రయత్నం చేయాలన్నారు. గతంలో  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  టీపీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీ సీనియర్లు వి. హనుమంతరావు, కాకా లాంటి వాళ్లను కలుపుకొని వెళ్లారని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్ మెట్లెక్కనని తేల్చి చెప్పారు. మరికొందరు సీనియర్లు కూడ గాంధీ భవన్ కు దూరంగా ఉంటున్నారు. పార్టీ సమావేశాలకు ఈ నేతలంతా దూరంగా ఉంటున్నారు.

టీపీసీసీ చీఫ్ గా  బాధ్యతల నుండి తప్పుకొన్న తర్వాత ఉత్తమ్ కుమార్ ఇవాళే గాంధీ భవన్ లో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని సన్మానించారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?