తెలంగాణలో 24 గంటల్లో 340 కరోనా కేసులు:కరోనా రోగుల రికవరీ రేటు 97.49 శాతం

By narsimha lodeFirst Published Aug 30, 2021, 7:32 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 340 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు  6,57,716కి చేరుకొన్నాయి.రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,872కి చేరుకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,891 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.


హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 340 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 6,57,716కి చేరుకొన్నాయి.గత 24 గంటల్లో 359 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో కరోనా నుండి ఇప్పటివరకు 6,47,953కి చేరింది.

కరోనాతో నిన్న ఒక్క రోజు ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,872కి చేరుకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,891 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.తెలంగాణలో కరోనా మృతుల రేటు 0.58 శాతంగా నమోదైంది. కరోనా రోగుల రికవరీ రేటు 98.51 శాతంగా ఉందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇండియాలో కరోనా రోగుల రికవరీ రేటు 97.49 శాతంగా ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్క రోజు 75,102 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 2,45,59,439 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినందున రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నుండి విద్యా సంస్థలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకొంది. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ విద్యా సంస్థలను ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం. విద్యాసంస్థలు ప్రారంభించిన తర్వాత కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది.


 

click me!