భారీ వర్షాల హెచ్చరికలు: ఐదు జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన సీఎస్

By narsimha lodeFirst Published Aug 30, 2021, 7:54 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినందున రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నుండి విద్యా సంస్థలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకొంది. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ విద్యా సంస్థలను ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం. విద్యాసంస్థలు ప్రారంభించిన తర్వాత కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది.

హైదరాబాద్:వాతావరణ శాఖ జారీ చేసిన సూచనలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ ఆదేశించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ , డిజిపి మహేందర్ రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్లు మరియు నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లతో బూర్గుల రామకృష్ణారావు భవన్ నుండి సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

పూర్వ   ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నీటి పారుదల , విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తగా పరిస్థితులను ఎప్పటికప్పడు మానిటరింగ్ చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు , ఉద్యోగులు హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని సీఎస్ ఆదేశించారు.

జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులందరితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.ఈ వీడియోకాన్ఫరెన్స్ లో   రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  సునీల్ శర్మ, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  రజత్ కుమార్, ఫైర్ సర్వీసెస్ డిజి  సంజయ్ కుమార్ జైన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా , వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిరిజ్వీ, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి  రాహుల్ బొజ్జా,  ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ  రోనాల్డ్ రోస్, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


 

click me!