కేసీఆర్ పుట్టినరోజు చేసుకోవద్దా.. బర్త్ డే నాడు నిరసనలేంటీ: రేవంత్‌ ఆందోళనపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 17, 2022, 07:45 PM IST
కేసీఆర్ పుట్టినరోజు చేసుకోవద్దా.. బర్త్ డే నాడు నిరసనలేంటీ: రేవంత్‌ ఆందోళనపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నాడు (kcr birth day) టీకాంగ్రెస్‌లో (congress) భిన్న స్వరాలు వినిపించాయి. పుట్టినరోజు వేడుకలు వేరు.. నిరుద్యోగ పోరాటం వేరని అన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (jagga reddy) . తాను కూడా సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నా అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నాడు (kcr birth day) టీకాంగ్రెస్‌లో (congress) భిన్న స్వరాలు వినిపించాయి. పుట్టినరోజు వేడుకలు వేరు.. నిరుద్యోగ పోరాటం వేరని అన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (jagga reddy) . తాను కూడా సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నా అన్నారు. కేసీఆర్‌కు పుట్టినరోజు నాడు .. కాంగ్రెస్ నిరుద్యోగ సమస్యపై చేపట్టిన నిరసన తనకు తెలియదన్నారు జగ్గారెడ్డి. 

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వివిధ రూపాల్లో నిరసన తెలపాలని యువజన కాంగ్రెస్ పేర్కొంది. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆయన‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డిని పోలీసులు వారి వాహనాల్లోనే తిప్పారు. తొలుత జూబ్లీహిల్స్ నుంచి లంగర్‌హౌస్ వైపు తీసుకెళ్లిన పోలీసులు.. తర్వాత ఆయనను గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

పీఎస్ నుంచి విడుదలైన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదన్నారు రేపటి నుంచి రోడ్ల మీదనే వుంటామని రేవంత్ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. కేసీఆర్‌ను గద్దె దించేవరకూ విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. నిరసన సెగ ముఖ్చమంత్రికి చూపిస్తామన్నారు. 

ఇక, ఈ పరిణామాలపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేసీఆర్ జన్మదినం...ప్రతిపక్ష నేతల జైలుదినం కావాలా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల తరపున ప్రశ్నించడమే తాము చేసిన నేరమా అంటూ ప్రశ్నలు సంధించారు. ఉద్యోగాల భర్తీకి మెగా నోటిఫికేషన్ డిమాండ్ చేస్తూ అన్నీ మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. #TelanganaUnemployementDay అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం