ఇంకా టైముంది: సంచలన ప్రకటనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

By narsimha lode  |  First Published Jul 4, 2022, 3:51 PM IST

రేవంత్ రెడ్డి తాను గొడవ పడేది ఎత్తుగడే అనుకోండని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.  సోమవారం నాడు జగ్గారెడ్డి మీడియాతో మట్లాడారు. ఇవాళ సంచలన ప్రకటన చేస్తానని జగ్గారెడ్డి ఆదివారం నాడు ప్రకటన చేశారు.ఈ తరుణంలో జగ్గారెడ్డి ఇవాళ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.


హైదరాబాద్: Revanth Reddy, తాను గొడవ పడేది ఎత్తుగడే అనుకోండని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy అన్నారు. సోమవారం నాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. Congress  పార్టీకి చెందిన నేతల మధ్య మాటల యుద్ధమంతా వ్యూహామని జగ్గారెడ్డి చెప్పారు. రాజకీయాల్లో ఎత్తుగడలుంటాయన్నారు.  ఇవాళ సంచలన ప్రకటన చేస్తానని జగ్గారెడ్డి ఆదివారం నాడు చెప్పారు. తాను సంచలన వ్యాఖ్యలు చేయడానికి ఇంకా సమయం ఉందన్నారు. తాను ఏం మాట్లాడినా, చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ కోసమేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తనను ఎవరూ కూడా డామిినేట్ చేయలేరని జగ్గారెడ్డి ఆవేశంగా చెప్పారు.ఏ రాజకీయపార్టీ కూడా తనను డామినేట్ చేయలేదన్నారు. పార్టీ లైన్ లో ఉంటానన్నారు. ఎక్కడికి వెళ్లనని కూడా చెప్పారు.తాను పార్టీ వీడాలని అనుకొంటే తనను ఆపేది ఎవరని కూడా జగ్గారెడ్డి ప్రశ్నించారు.సోనియాగాంధీని కలిసి కాంగ్రెస్ లలో చోటు చేసుకొంటున్న పరిణామాలను వివరిస్తానని ఆయన చెప్పారు.తాను ఏం మాట్లాడినా కూడా నెగిటివ్ గా తీసుకోవద్దని కూడా జగ్గారెడ్డి పార్ఠీ శ్రేణులను కోరారు.

రేవంత్ రెడ్డి, తన మధ్య మాటల యుద్ధం కూడా ఎత్తుగడనే అనుకోండి అని ఆయన అన్నారు. తన లైన్ కాంగ్రెస్ లోనే ఎవరూ గందరగోళపడవద్దని కూడా జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తామని జగ్గారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. Narendra Modi  సభ ఫెయిల్ అయిందన్నారు. 10 లక్షల మందితో సభ అంటే ఈ గ్రౌండే సరిపోదన్నారు. గ్రౌండ్ కెపాసిటే లక్ష అని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఈ సభకు వచ్చింది 50 వేల మందేనని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.

Latest Videos

undefined

విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా హైద్రాబాద్ కు ఈ నెల 2న వచ్చారు. యశ్వంత్ సిన్హాకు బేగంపేట విమానాశ్రయంలో టీఆర్ఎస్ ఘనంగా స్వాగతం పలికింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు పాల్గొన్నారు. యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికే కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొనవద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించినా కూడా బండకేసి కొట్టాల్సిందేనని రేవంత్ రెడ్డి మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారు.  ఈ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను జగ్గారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.

తాము రేవంత్ రెడ్డి పాలేర్లమా అని వ్యాఖ్యానించారు.టీపీసీసీ చీఫ్ పదవి నుండి రేవంత్ రెడ్డిని తొలగించాలని  పార్టీ అధిష్టానానికి లేఖ రాస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. రేవంత్ రెడ్డి లేకపోయినా కూడా పార్టీని నడుపుతామని కూడా ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలకు  కొనసాగింపుగానే ఈ నెల 3న 24 గంటల్లో సంచలన ప్రకటన చేస్తానని కూడా జగ్గారెడ్డి ప్రకటించారు.  అయితే ఇవాళ మాత్రం వ్యూహాంలో భాగంగానే రేవంత్ రెడ్డితో తన గొడవ అని అనుకోండని జగ్గారెడ్డి చెప్పడం చర్చకు దారి తీసింది.

also ead:రేపు సంచలన నిర్ణయం.. రాహుల్‌కు ఇచ్చిన మాట తప్పినందుకు బాధగా ఉంది: జగ్గారెడ్డి

యశ్వంత్ సిన్హా హైద్రాబాద్ టూర్ కార్యక్రమంలో టీఆర్ఎస్ తో కలిసి వేదిక పంచుకోనేందుకు కాంగ్రెస్ వెనుకాడింది. అధికార టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న తమ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఆ పార్టీతో వేదిక పంచుకొంటే తప్పుడు సంకేతాలు వస్తాయని భావించిన రాష్ట్ర నాయకత్వం పార్టీ అధినాయకత్వానికి సమాచారం ఇవ్వడంతో జాతీయ నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం.

click me!