తెలంగాణ హైకోర్టుకు దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించి సిర్కూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక హైకోర్టుకు చేరింది. ఈ విషయమై అమికస్ క్యూరీగా దేశాయి ప్రకాష్ రెడ్డిని ఉన్నత న్యాయస్థానం నియమించింది. 2019 డిసెంబర్ 6వ తేదీన దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. షాద్ నగర్ కు సమీపంలోని చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకొంది.
హైదరాబాద్: Telangana హైకోర్టుకు దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించి సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక High Court కు చేరింది. ఈ విషయమై Amicus Curiae దేశాయ్ ప్రకాష్ రెడ్డిని నియమించింది హైకోర్టు.
Disha నిందితుల Encounter పై పౌరహక్కుల సంఘం నేతలు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా Supreme Court సిర్పూర్కర్ కమిషన్ ను నియమించింది.సిర్పూర్కర్ కమిషన్ ఈ ఎన్ కౌంటర్ ను బూటకపు ఎన్ కౌంటర్ గా తేల్చి చెప్పింది. ఈ నివేదికను ఈ ఏడాది మే 20న సుప్రీంకోర్టు తెలిపింది. ఇరు వర్గాలకు ఈ కమిషన్ నివేదికను కూడా అందించాలని సుప్రీంకోర్టు తెలిపింది. అంతేకాదు హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను High Court బదిలీ చేసింది సుప్రీంకోర్టు. త్వరగా ఈ కేు విచారణు పూర్తి చేయాలని కూడా ఉన్నత న్యాయస్థానం ఈ ఏడాది మే 20 ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టులో దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ జరగనుంది. అయితే ఈ విషయమై Sirpurkar Commission హైకోర్టుకు చేరింది. ఈ విషయమై అమికస్ క్యూరీగా దేశాయి ప్రకాష్ రెడ్డిని నియమించింది.
2019 నవంబర్ 28న రాత్రి దిశపై Shadnagar కు సమీపంలోని చటాన్‌పల్లి అండర్ పాస్ బ్రిడ్జి వద్ద నలుగురు నిందితులు సామాూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ ఘటనకు పాల్పడిన జొల్లు శివ,. జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు, మహహ్మద్ ఆరిఫ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విచారణలో భాగంగా పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు తప్పించుకొనే క్రమంలో తాము జరిపిన కాల్పుల్లో నిందితులు నలుగురు చనిపోయారని అప్పటి సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ 2019 డిసెంబర్ 6వ తేదీన చోటు చేసుకొంది.
ఈ ఎన్ కౌంటర్ పై నిందితులు కుటుంబ సభ్యులు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయమై హక్కుల సంఘాలు సుప్రీంకోర్టులో పిటిసన్ దాఖలు చేయడంతో సిర్కూర్కర్ కమిషన్ ను సుప్రీంకోర్టు నియమించింది. ఇదే సమయంలో కరోనా కేఃసుల తీవ్రత పెరగడంతో సిర్కూర్కర్ కమిషన్ కు సుప్రీంకోర్టు గడువును పొడిగించింది. దీంతో ఈ ఏడాది జనవరి మాసంలో సిర్కూర్కర్ కమిషన్ తన నివేదికను ఉన్నత న్యాయస్థానికి సమర్పించింది.
also read:దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం: తేల్చేసిన సిర్పూర్కర్ కమిషన్
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు దిశి నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ నిర్వహింంచనుంది. సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికలో కీలక విషయాలను ప్రస్తావించింది. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై హత్య కేసులను నమోదు చేయాలని కూడా సిర్కూర్కర్ కమిషన్ సిఫారసు చేసింది. విచారణ సమయంలో పోలీసులు తమకు కూడా కట్టుకథలు చెప్పారని కూడా కమిషన్ తన నివేదికలో ప్రస్తావించింది. సిర్కూర్కర్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ కేసు విచారణ సాగే అవకాశం ఉంది.