కారణమిదీ: పోలీసుల అదుపులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

By narsimha lode  |  First Published May 1, 2022, 2:58 PM IST

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని ఆదివారం నాడు హైద్రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఆయనను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.


హైదరాబాద్:  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy ని ఆదివారం నాడు Hyderabad పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.  బంజారాహిల్స్ పోలీస స్టేషన్ కు జగ్గారెడ్డిని తరలించారు.
Osmania universityలో  Raul Gandhi  సభకు అనుమతివ్వకపోవడంతో Ministers Quarters ను ఆదివారం నాడు ఓయూ విద్యార్ధులు ముట్టడించారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఓయూ విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన విద్యార్ధులను పరామర్శించేందుకు వెళ్లిన జగ్గారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

మరో వైపు ఓయూలో వీసీ చాంబర్ వద్ద ఎన్ఎస్‌యూఐ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు దిగిన ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Latest Videos

undefined

ఈ నెల 7వ తేదీన ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్ధులతో  రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అయితే రాహుల్ గాంధీ సభకు ఓయూ గవర్నరింగ్ బాడీ అనుమతి ఇవ్వలేదు. రాజకీయ పార్టీల సమావేశాలు అనుమతిని ఇవ్వకూడదని గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాహుల్ గాంధీ మీటింగ్ కి అనుమతి ఇవ్వలేదని ఓయూ అధికారులు తెలిపారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాహుల్ మీటింగ్ కి అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరో వైపు రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేస్తున్న విమర్శలపై క్షమాపణలు చెప్పాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.

ఓయూలో రాహుల్ గాంధీ సభకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని ఇంచార్జీగా నియమించారు. దీంతో ఓయూ విద్యార్ధులను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకొన్న జగ్గారెడ్డి వారిని పరామర్శించేందుకు వెళ్లారు. దీంతో జగ్గారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

ఈ నెల 6, 7 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈ నెల 6న రాహుల్ గాంధీ వరంగల్ లో జరిగే సభలో పాల్గొంటారు. ఈ నెల7 హైద్రాబాద్ లో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. పార్టీ సభ్యత్వం నిర్వహించిన కార్యకర్తలతో ఫోటో సెషన్ లో కూడా రాహుల్ గాంధీ పాల్గొంటారు. తొలిసారిగా రాహుల్ గాంధీ హైద్రాబాద్ లో  పార్టీ కార్యాలయానికి రానున్నారు.  అదే రోజున ఓయూలో విద్యార్ధులతో సమావేశం ఏర్పాటుకై కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అయితే ఈ సమావేశానికి ఓయూ అధికారులు నిరాకరించడంతో ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.

రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తుంది. వరంగల్ లో సభ రైతుల సమస్యలపై ప్రధానం రాహుల్ ప్రసంగించనున్నారు కాంగ్రెస్ హాయంలో రైతులకు ఏం చేసిందో వివరించనున్నారు. అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రైతులకు ఏం చేస్తామో కూడా వివరించనున్నారు. ఈ సభ విజయవంతం చేయడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సన్నద్దం చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఈ సభ ద్వారా  రాజకీ ప్రత్యర్ధులకు కూడా సవాల్ విసరాలని కాంగ్రెస్ భావిస్తుంది.


 

click me!