నల్గొండ టీఆర్ఎస్‌లో విభేదాలు : ‘‘మే డే’’ వేడుకల్లో వేముల వీరేశం, చిరుమర్తి వర్గాల మధ్య ఘర్షణ

Siva Kodati |  
Published : May 01, 2022, 02:37 PM IST
నల్గొండ టీఆర్ఎస్‌లో విభేదాలు : ‘‘మే డే’’ వేడుకల్లో వేముల వీరేశం, చిరుమర్తి వర్గాల మధ్య ఘర్షణ

సారాంశం

ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నేతల మధ్య వున్న వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. నిన్నగాక మొన్న వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య చిచ్చు రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల్లో పెద్ద చర్చుకు దారి తీసింది. 

నల్గొండ జిల్లా నకిరేకల్‌ టీఆర్ఎస్‌లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మే డే సందర్భంగా జెండా ఎగురవేస్తున్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయులను ఎమ్మెల్యే లింగయ్య వర్గీయులు అడ్డుకున్నారు. పార్టీతో సంబంధం లేని మాజీ ఎమ్మెల్యే వేముల వర్గీయులు ఈ కార్యక్రమం ఎలా చేస్తారని లింగయ్య వర్గం నేతలు ప్రశ్నించారు. దీంతో రెండు వర్గాల మధ్య  ఘర్షణ చోటు చేసుకుంది. నేతలు బాహాబాహీకి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. 

కాగా ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నేతల మధ్య వున్న వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (bhadradri kothagudem) కొత్తగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్ (kothagudem municipal chairperson) కాపు సీతా మహాలక్ష్మీపై కౌన్సిలర్ భర్త దాడి చేశాడు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తుండగా చైర్‌పర్సన్ సీతా మహాలక్ష్మీ బైక్‌ను ఢీకొట్టాడు కౌన్సిలర్ భర్త. దీంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయారు. ఏడుస్తూ దండం పెట్టినా వినలేదని సీతా మహాలక్ష్మీ వాపోయారు. దీనిపై జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావుకు (rega kantha rao) ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు (vanama venkateswara rao) సీతా మహాలక్ష్మీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. 

అదే నెలలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో (mahabubabad district) టీఆర్ఎస్ పార్టీ (trs) తలపెట్టిన రైతు దీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ (minister satyavathi rathod) సమక్షంలోనే నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎంపీ మాలోత్ కవిత.. (maloth kavitha) రైతు దీక్షలో మాట్లాడుతుండగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ (mla shankar naik) మైక్ లాక్కొన్నారు. దీంతో బిత్తరపోయిన కవిత కింద కూర్చొని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు ఫిర్యాదు చేశారు. అటు వరంగల్ జిల్లాలోనూ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మంత్రి దయాకర్ (errabelli dayakar rao) పాల్గొన్న రైతు దీక్షకు స్థానిక ఎమ్మెల్యే, కార్యకర్తలు డుమ్మాకొట్టి ఇంట్లో కూర్చొన్నారు. దయాకర్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తీరిగ్గా సభా వేదిక వద్దకు చేరుకున్నారు ఎమ్మెల్యే. వరుస సంఘటనల నేపథ్యంలో నేతల తీరుపై టీఆర్ఎస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఒకటి కాదు రెండు అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..
హైద‌రాబాద్‌లో సొంతిళ్లు లేద‌ని బాధ‌ప‌డుతున్నారా? ఈ ప్రాంతంలో కొనుగోలు చేస్తే మీ క‌ల తీరిన‌ట్లే