Revanth reddy:మరోసారి సీఎం పదవిపై  రేవంత్ కీలక వ్యాఖ్యలు

Published : Dec 02, 2023, 04:25 AM ISTUpdated : Dec 05, 2023, 06:56 PM IST
Revanth reddy:మరోసారి సీఎం పదవిపై  రేవంత్ కీలక వ్యాఖ్యలు

సారాంశం

Revanth reddy: తెలంగాణా ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో గత రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈసారి హోరాహోరీగా పోరాటం చేసింది. అయినా ఎగ్జిట్ పోల్ మాత్రం గులాబీ పార్టీకి షాక్ ఇచ్చాయి. ఈ సారి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సీఎం పదవీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ  ఏమన్నారంటే..?    

 

Revanth reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించబడతాయి. అంతకు ముందు గురువారం ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొననున్నట్టు తెలుస్తోంది. చాలా సర్వేలు కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు తేలింది. దీంతో తుది ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఇండియా టుడేతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

గతంలో తనకు వైఎస్సాఆర్, కేసీఆర్‌లు ఆఫర్లు ఇచ్చారనీ, అయినా వాటిని తిరస్కరించానని పేర్కొన్నారు. అధికారం, కాంగ్రెస్ ఈ రెండింటిలో దేనికి ప్రాధ్యానత ఇస్తారని ప్రశ్నించగా..తాను ప్రజలకు సేవ చేయడానికి ఇష్టపడుతానని చెప్పుకోచ్చారు. తాను ఇండింపెండెంట్‌గానే జడ్పీటీసీ, ఎమ్మెల్సీగా గెలిచానన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా గెలిచానని తెలిపారు. తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్లు మోడీ, అమిత్ షా ల సెగ్మెంట్లలో ఉన్న ఓటర్ల కన్నా ఎక్కువ మంది తన నియోజక మార్గంలో ఉంటారని తెలిపారు.

ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేయడంతో తమ పార్టీకి 80+ సీట్లు వస్తాయని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.తన ప్రకారం తమ పార్టీకి  80+ సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం 119 సీట్లున్న అసెంబ్లీలో అధికార BRS 34-44 సీట్లు పొందవచ్చని, కాంగ్రెస్ 63-73 సీట్లతో తెలంగాణ థ్రిల్లర్‌ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. అంచనా వేసిన ఓట్ల శాతం ప్రకారం, కాంగ్రెస్‌కు 42 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేయగా, బీఆర్‌ఎస్‌కు 36 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. 

ఈ తరుణంలో సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేసులో మల్లు భట్టి విక్రమార్క  కూడా ఉన్నారా అని రాజ్ దీప్ సర్దేశాయ్ ప్రశ్నించగా... రేవంత్ రెడ్డి ఇలా బదులితూ తమ పార్టీలో గెలవబోయే 80 మంది ఎమ్మెల్యేలు కూడా సీఎం అభ్యర్థితేనని అన్నారు. సీఎం పోస్ట్ విషయంలో పార్టీ అ తీసుకున్న నిర్ణయమే తమకు శిరోధార్యమని పేర్కొన్నారు.  అధికారం కోసం తాను ఆశిస్తే ఇప్పటికే అధికార పక్ష పార్టీల్లో కీలక పదవుల్లో ఉండే వాడినని.. అయినా పదవులు ఆశించలేదు. అలా ఆశించకుండా ఉన్నాను.  కాబట్టే ప్రతిపక్ష పార్టీకి పీసీసీ చీఫ్‌గా ఉన్నానన్నారు. 20 ఏళ్లుగా అపొజిషన్ పార్టీలో ఉన్నానని దాంతోనే తాను సంతోషంగా ఉన్నానన్నారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu