కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన దామోదర్ రెడ్డి.. బీజేపీ‌లో చేరనున్నట్టుగా వెల్లడి

Published : Aug 22, 2022, 04:03 PM IST
కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన దామోదర్ రెడ్డి.. బీజేపీ‌లో చేరనున్నట్టుగా వెల్లడి

సారాంశం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. టీపీసీసీ లీగల్‌ సెల్‌ చైర్మన్‌గా ఉన్న దామోదర్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌లో తన పదవితో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. టీపీసీసీ లీగల్‌ సెల్‌ చైర్మన్‌గా ఉన్న దామోదర్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌లో తన పదవితో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎంత కష్టపడినా ఫలితం ఉండడం లేదని, తమ కష్టాన్ని పార్టీ నేతలు గుర్తించడం లేదని పేర్కొన్నారు. మరోవైపు భవిష్యత్తు నిర్ణయాన్ని కూడా దామోదర్ రెడ్డి ప్రకటించారు. తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు

ఇదిలా ఉంటే.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేష్ కుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ప్రస్తుత పరిణామాలు పరిశీలిస్తే తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రభావం కనిపిస్తోంది. ఇటీవలే దాసోజ్ శ్రవణ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిపిందే. ఇటీవల టీఆర్ఎస్‌ రాజీనామా చేసిన  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?