నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాస్తు మార్పులు

Published : Aug 22, 2022, 02:41 PM IST
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాస్తు మార్పులు

సారాంశం

హైదరాబాద్‌ నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం‌లో వాస్తు మార్పులు చేస్తున్నారు. గతంలో కూడా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వాస్తు ప్రకారం మార్పులు చేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌ నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం‌లో వాస్తు మార్పులు చేస్తున్నారు. గతంలో కూడా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వాస్తు ప్రకారం మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కార్యాలయం ఎంట్రన్స్‌లో మెయిన్ డోర్‌ను మూసేశారు. కార్యాలయంలోనికి వెళ్లేందుకు ఐరన్ మెట్లు ఏర్పాటు చేసి సైడ్ డోర్‌ను బీజేపీ నేతలు ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి బీజేపీ కార్యాలయంలో వాస్తు మార్పులు బీజేపీ నాయకత్వం శ్రీకారం చుట్టింది. కొన్నాళ్ళ క్రితం మూసివేసి‌‌న మెయిన్ ఎంట్రన్స్‌ను పూర్తిగా తొలగించి.. కొత్త మెట్లను ఏర్పాటు చేయనున్నట్టుగా  తెలుస్తోంది. 

అయితే హంపి పీఠాధిపతి సూచనల మేరుక మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సూచనలు పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి.. వారి అనమతితో పనులకు శ్రీకారం చుట్టారు. ఇక, తెలంగాణ అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మార్పులు చేరపట్టినట్టుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు