ఆ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు: జూ. ఎన్టీఆర్, అమిత్ షా మీటింగ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By narsimha lode  |  First Published Aug 22, 2022, 2:58 PM IST

అమిత్ షాతో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ కేవలం సినిమాలకే సరంబంధించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ భేటీలో రాజకీయ అంశాల ప్రస్తావనే లేదన్నారు. 


విశాఖపట్టణం: జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోంశాఖ అమత్ షా భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నాడు రాత్రి హైద్రాబాద్ శంషాబాద్ లో నోవాటెల్ హోటల్ లో కేంద్ర మంత్రి అమిత్ షా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం తెలిసిందే.ఈ భేటీకి  ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారి తీసింది. 

సోమవారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  విశాఖ జిల్లాలో మీడియాతో మాట్లాడారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో అమితో్ షా భేటీ రాజకీయాలకు సంబంధం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశం కేవలం సినిమాలకే పరిమితమని చెప్పారు. ఇది కేవలం సినిమాలకు సంబంధించిన సమావేశంగా కిషన్ రెడ్డి వివరించారు.సినిమాలపైనే  జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా చర్చించారన్నారు సీనియర్  ఎన్టీఆర్ గురించి కేంద్ర మంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను అడిగి తెలుసుకున్నారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి డిన్నర్ మీట్ ఏర్పాటు చేయాలని అమిత్ షా కోరారని చెప్పారు. దీంతో  ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా కిషన్ రెడ్డి తెలిపారు. ఏపీకి చెందిన వైసీపీ నేత కొడాలి నాని చేసిన వ్యాఖ్యల గురించి తాను వ్యాఖ్యానించబోనని కిషన్ రెడ్డి తెలిపారు. 

Latest Videos

undefined

మునుగోడులో బీజేపీ సభలో పాల్గొన్న తర్వాత ఢిల్లీకి వెళ్లే ముందు శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర మంత్రి అమిత్ షా డిన్నర్ మీటింగ్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ విస్తరణ కోసం  జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయి ఉంటారని ఏపీకి చెందిన మాజీ మంత్రి  కొడాలి నాని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా అనవసరంగా ఎవరిని కూడా  కలవరని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ భేటీపై తెలుగు రాజకీయ వర్గాల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొంది. దీంతో ఈ భేటీపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. సుమారు అరగంటపాటు జూ.ఎన్టీఆర్ తో అమిత్ షా చర్చించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

also read:జూనియర్ ఎన్టీఆర్ యంగ్ డైనమిక్ లీడర్.. వారిద్దరి భేటీ భవిష్యత్తులో రాజకీయ మార్పుకు సంకేతం: విష్ణువర్దన్ రెడ్డి

దక్షిణాదిలో బీజేపీని విస్తరించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని ఆ పార్టీ ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే జూ. ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారనే ప్రచారం కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే  ఏపీకి చెందిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు రాజకీయాల్లో మార్పునకు అమిత్ షా, జూ. ఎన్టీఆర్  భేటీ  సంకేతంగా పేర్కొన్నారు. 

 

click me!