దొంగ పాస్‌పోర్టు కేసులో కేసీఆర్ అరెస్ట్... ఎమ్మెస్సార్ విడిపించారు: ఉత్తమ్

Published : Oct 05, 2018, 04:03 PM IST
దొంగ పాస్‌పోర్టు కేసులో కేసీఆర్ అరెస్ట్... ఎమ్మెస్సార్ విడిపించారు: ఉత్తమ్

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రిపై కేసీఆర్ పై టిపిసిసి చీప్ ఉత్తమ్ నిప్పులుచెరిగారు. కేసీఆర్ బరాబర్ బట్టెబాజ్ అంటానని మరోసారి విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తానే సాధించానని చెప్పడానికి కేసీఆర్ కు సిగ్గూ, శరం ఉండాలంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఉద్యమ సమయంలో నిరాహార దీక్ష పేరుతో కేసీఆర్ కేవలం గెడ్డం మాత్రమే పెంచాడని ఎద్దేవా చేశారు.  నిమ్స్ ఆస్పత్రి రిపోర్టును చూస్తే కేసీఆర్ బాగోతం బైటపడుతుందని అన్నారు. అవసరమైన ప్లూయిడ్స్ ఎప్పటికప్పుడు తీసుకుని కేసీఆర్ దొంగ దీక్ష చేశారని ఉత్తమ్ ఆరోపించారు. 

తాను భారత సైన్యంలో పనిచేస్తున్నపుడు కేసీఆర్ పాస్ పోర్టు బ్రోకర్ గా పనిచేసేవాడని ఉత్తమ్ పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా కేసులో కేసీఆర్‌ను డిల్లీ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేస్తే అప్పటి కాంగ్రెస్ మంత్రి ఎమ్మెస్సార్ విడిపించారన్నారు. అలాంటి వ్యక్తి  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 

తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ను బరాబర్ బట్టెమాజ్ అంటానన్నారు. కేసీఆర్ రాష్ట్రంలో కుటుంబ పాలన నడిపిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. తమకు పిల్లలు లేరు...ప్రజలే తమ వారసులంటూ ఉత్తమ్ వ్యాఖ్యానించారు.   మహాకూటమిని చూసి కేసీఆర్ భయపడుతూ విమర్శలకు దిగుతున్నాడని ఉత్తమ్ తెలిపారు. 
 
PREV
click me!

Recommended Stories

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే