ఓటర్ల జాబితా అవకతవకలు: విచారణ సోమవారానికి వాయిదా

By Nagaraju TFirst Published Oct 5, 2018, 3:46 PM IST
Highlights

హైకోర్టు ఉత్తర్వులు అందే వరకు ఓటర్ల తుది జాబితాను వెబ్‌సైట్లో పొందుపరచొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి వేసిన పిటీషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. 

 హైకోర్టు ఉత్తర్వులు అందే వరకు ఓటర్ల తుది జాబితాను వెబ్‌సైట్లో పొందుపరచొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి వేసిన పిటీషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. 

ఈ నెల 8న కౌంటర్‌ దాఖలు చేయాలని ఈసీకి హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను రిట్ పిటీషన్‌కు లోబడి ప్రకటించాలని హైకోర్టు ఈసీకి సూచించింది. తదుపరి విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది. ఓటర్ల జాబితా అవకతవకలపై మొత్తం మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.

 తెలంగాణ ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి వేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఓటర్ల జాబితా సవరించాలని, ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ను పొడిగించాలని మర్రి శశిధర్ రెడ్డి తరపున న్యాయవాది జంథ్యాల రవిశంకర్ వాదించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 
 
హైకోర్టులో న్యాయం గెలుస్తుందని నమ్ముతున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. వ్యక్తిగతంగా తాము కోర్టులను ఆశ్రయించలేదని ప్రజలకోసం ఓటును పరిరక్షించాలన్న ఉద్దేశంతో కోర్టలో పిటీషన్ వేసినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టులో వాదనలు జరిగాయని సోమవారం పిటీషన్ పై విచారణ జరిపి తీర్పు వెలువరిస్తుందని తెలిపారు.  
 


 
మరోవైపు గురువారం తెలంగాణ ఓటర్ల జాబితా అవకతవకలపై హైకోర్టే తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలపై హైకోర్టు శుక్రవారం విచారించాలని, అవకతవకలు ఉన్నట్టు గుర్తిస్తే ఓటర్ల జాబితా సవరణ షెడ్యూలును పొడిగించేందుకు హైకోర్టుకు స్వేచ్ఛ ఉందని సుప్రీం కోర్టు ఆదేశించింది. 

ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయని, వాటిని సవరించేందుకు వీలుగా ఓటర్ల జాబితా సవరణ పాత షెడ్యూలును పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ పై ధర్మాసనం గురువారం విచారించింది. మర్రి శశిధర్‌రెడ్డి తరపున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, జంధ్యాల రవిశంకర్‌ వాదనలు వినిపించారు.

ఓటరు నమోదుకు జనవరి 1, 2018ని అర్హత తేదీగా పేర్కొన్నారని, దీని వల్ల దాదాపు 20 లక్షలమంది కొత్త ఓటర్లు ఓటుహక్కును కోల్పోతున్నారని పోతుగంటి శశాంక్‌రెడ్డి అనే వ్యక్తి మరో పిటిషన్‌ వేశారు. మర్రి తరపున సింఘ్వీ వాదిస్తూ 30.13 లక్షల మేర ఓటర్ల పేర్లు పునరావృతమవడం, 20 లక్షల ఓటర్లను తొలగించడం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పునరావృతమైన పేర్లు 18 లక్షల మేర ఉండడం వంటి మూడు అంశాలను విపులంగా సుప్రీం కోర్టుకు నివేదించారు.

శశాంక్‌రెడ్డి తరపున నిరూప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ జనవరి 1, 2019 అర్హత తేదీతో ఓటర్ల సవరణ షెడ్యూలును పునరుద్ధరించాలని కోరారు. కేసీఆర్‌ అసెంబ్లీ రద్దుచేసి, కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు ను 2024 వరకూ వినియోగించుకోకుండా చేస్తారా అని ప్రశ్నించారు.  

కేంద్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్‌ న్యాయవాది అమిత్‌ శర్మ వాదిస్తూ ఓటర్ల జాబితా వంటి పిటీషన్లను హైకోర్టు విచారించి కొట్టి వేసిందని, వాటిని పరిగణనలోకి తీసుకోరాదని కేంద్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది అమిత్ శర్మ వాదించారు. గతవారం ధర్మాసనం నోటీసులు ఇచ్చినప్పుడు దానికి ఈరోజు కౌంటర్‌ వేయకుండా ఇప్పుడు కొత్త వాదన తెరమీదకు తేవడం సరికాద సింఘ్వీ అన్నారు.

తుది ఓటర్ల జాబితా ఈనెల 8న ప్రచురితం కానుందని, హైకోర్టుకు వెళ్లే సమయం లేదని నివేదించారు.  పిటిషనర్ల వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను హైకోర్టు శుక్రవారమే విచారించాలని ఆదేశించింది. పిటిషనర్ల అభ్యర్థన న్యాయసమ్మతమని తేలితే ఓటర్ల సవరణను పొడిగించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీచేసే స్వేచ్ఛ హైకోర్టుకు ఉందని పేర్కొంది.  

click me!