తెలంగాణ కాంగ్రెసులో చిచ్చు పెట్టిన కేసీఆర్ తో ఎమ్మెల్యేల భేటీ

By Siva KodatiFirst Published Jun 26, 2021, 5:19 PM IST
Highlights

గాంధీ భవన్‌లో టీ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం వాడివేడిగా జరుగుతోంది. నిన్న సీఎం కేసీఆర్‌‌తో కాంగ్రెస్ నేతలు సమావేశం కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాన్ని సమావేశంలో ప్రస్తావించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి

గాంధీ భవన్‌లో టీ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం వాడివేడిగా జరుగుతోంది. నిన్న సీఎం కేసీఆర్‌‌తో కాంగ్రెస్ నేతలు సమావేశం కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాన్ని సమావేశంలో ప్రస్తావించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోషల్ మీడియాలో తప్పుగా ట్రోల్ అవుతోందని ఆయన చెప్పారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు. సమస్యలు సీఎంతో కాకుంటే ఇంకా ఎవరికి చెబుతామంటూ వివరణ ఇచ్చారు. తాము కలిసింది తప్పుబట్టేవాళ్లు.. ఇన్నాళ్లు ఎందుకు స్పందించలేదన్నారు.  తప్పయితే కేంద్ర మంత్రులను కలిసి కూడా వినతిపత్రాలు ఇస్తున్నారు కదా అని... ఇది తప్పు కదా అని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ సీఎంలు వున్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవలేదా అని వారు గుర్తుచేశారు. 

Also Read:మరియమ్మ కొడుకుకు ఉద్యోగం: కేసీఆర్‌తో సీఎల్పీ నేత భట్టి భేటీ

అడ్డగూడూరు ఘటనకు సంబంధించి సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ తో భేటీ అయింది. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.  కస్టోడియల్ డెత్ కు గురైన మరియమ్మ కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తాము చేసిన డిమాండ్ విషయమై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. మరియమ్మ కుటుంబానికి ఇల్లు కూడ ఇచ్చేందుకు సీఎం అంగీకరించారన్నారు.మరియమ్మ బిడ్డలకు ఆర్ధిక సహాయం చేయాలని తాము చేసిన వినతికి సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.
 

click me!