పాఠశాలల ప్రారంభం, ఆన్‌లైన్ క్లాసులు ఆ రెండు తరగతులకే: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

By Siva KodatiFirst Published Jun 26, 2021, 4:12 PM IST
Highlights

జూలై 1వ తేదీ నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. జూలై 1 నుంచి 50 శాతం టీచర్లు హాజరుకానున్నారు. మరో 50 శాతం టీచర్లు మరుసటి రోజు విధులకు హాజరవుతారు. కేవలం 9,10 పదో తరగతులకు మాత్రమే ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు.

జూలై 1వ తేదీ నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. జూలై 1 నుంచి 50 శాతం టీచర్లు హాజరుకానున్నారు. మరో 50 శాతం టీచర్లు మరుసటి రోజు విధులకు హాజరవుతారు. కేవలం 9,10 పదో తరగతులకు మాత్రమే ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. అలాగే టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి కూడా కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఏ ప్రాతిపదికన బదిలీలు, ప్రమోషన్లు అన్నది త్వరలోనే ప్రభుత్వం నిర్ణయించనుంది. 

Also Read:ప్రత్యక్ష తరగతులకే తెలంగాణ సర్కార్ మొగ్గు: జూలై 1 నుండి విద్యాసంస్థల ప్రారంభం

కాగా, తెలంగాణ రాష్ట్రంలో జూలై 1వ తేదీ విద్యా సంస్థలను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  కొద్దిరోజుల క్రితం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో జూలై 1వ తేదీ నుండి విద్యాసంస్థలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఫిబ్రవరి 1 వతేదీన విద్యాసంస్థలను ప్రారంభించింది.  కరోనా కేసులు పెరిగిపోవడంతో  విద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయం తీసుకొన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది మార్చి 24 నుండి విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో కరోనా కేసుల నేపథ్యంలో ఈ ఏడాది మే 12 నుండి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేశారు. ఈ నెల 20 నుండి లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ  ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 
 

click me!