డిసెంబర్ 12న ప్రభుత్వం కొలువుదీరడం ఖాయం: ఉత్తమ్

By Nagaraju TFirst Published Oct 12, 2018, 7:46 PM IST
Highlights

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి జోష్ మీద ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం కొలువు దీరేందుకు ముహూర్తం కూడా పెట్టేశారు. డిసెంబర్ 12న కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరడం ఖాయమంటున్నారు. 
 

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి జోష్ మీద ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం కొలువు దీరేందుకు ముహూర్తం కూడా పెట్టేశారు. డిసెంబర్ 12న కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరడం ఖాయమంటున్నారు. 

శుక్రవారం గాంధీభవన్ లో ఎంపీ డీఎస్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి అనుచరులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 30 మంది ఎంపీటీసీలు, 50 మంది మాజీ సర్పంచ్ లకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతించారు. 

కార్యకర్తల ఉత్సాహం చూస్తేంటే నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్సే విజయం సాధిస్తుందనేది స్పష్టమవుతుందని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ముదనష్టపు కేసీఆర్ పాలన అంతం కావాలని పిలుపునిచ్చారు.  తెలంగాణ అంతటా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందన్నారు. 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానని కేసీఆర్ దగా చేశారని ఆరోపించారు. నిజామాబాద్‌‌లో ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్‌కు లేదన్నారు. కేసీఆర్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. 

డిసెంబర్ 12న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో ప్రచారం చేసుకోవడం తప్ప రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. రైతులకు నాలుగు వేలు ఇస్తున్నామని చెప్పిన కేసీఆర్ మొదటి సంవత్సరం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. రైతు పండించే అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 100 రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 

click me!