నీ మంత్రివర్గమంతా ఏక్‌నాథ్‌షిండేలే: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

Published : Jul 11, 2022, 07:14 PM IST
నీ మంత్రివర్గమంతా ఏక్‌నాథ్‌షిండేలే: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

సారాంశం

.  కేసీఆర్ మంత్రివర్గం అంతా ఏక్‌నాథ్ షిండేలేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఏక్ నాథ్ షిండేలను ఉత్పత్తి చేసిన చరిత్ర కేసీఆర్ దేనన్నారు. అలాంటి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

హైదరాబాద్: KCR మంత్రివర్గం మొత్తం ఏక్‌నాథ్ షిండేలేనని టీపీసీసీ చీఫ్ Revanth Reddy  విమర్శించారు. ఏక్‌నాథ్ షిండేలను ఉత్పత్తి చేసిన కేసీఆర్ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కంకణం కట్టుకున్నట్టుగా మాట్లాడడం హాస్యాస్పందంగా ఉందని ఆయన అన్నారు. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారంనాడు Hyderabad  లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం నిన్న మీడియా సమావేశంలో ఏకపాత్రాభినయం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో Rajiv gandhi, Vajpayee లు పార్టీ పిరాయింపులను నిరోధించేందుకు ఎంతో ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు. కానీ కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ లు పార్టీ ఫిరాయింపులను యధేచ్ఛగా ప్రోత్సహించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.పరమ దుర్మార్గుడివైన నీవు ప్రజలచేత ఎన్నుకోబడిన టీడీపీని, తెలంగాణ ఇచ్చి ప్రజల మన్ననలు పొందిన కాంగ్రెస్ పార్టీని సీపీఐ నుండి  ఎన్నికైన రవీంద్రనాయ క్ ను కూడా TRS పార్టీలో చేర్చుకొన్న ఘనత కేసీఆర్‌దేనని ఆయన చెప్పారు. 

కేసీఆర్ సృష్టించిన భూతం ఆయననే వెంటాడుతుందన్నారు. తొలుత TDP లో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తీసుకొని మంత్రిగా ప్రమాణం చేయించి తెలంగాణలో Eknath Shinde ను పుట్టించిందే కేసీఆర్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్కడితో ఆగలేదన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, Sabitha indra Reddyలతో పాటు పలువురిని టీఆర్ఎస్ లో చేర్చుకోలేదా అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

నీ మంత్రివర్గం మొత్తం ఏక్‌నాథ్ షిండేలేనని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నీ మంత్రివర్గంలో ఉన్నవారిలో తెలంగాణ కోసం పోరాటం చేసినవారున్నారా అని ప్రశ్నించారు. అంతేకాదు నీ మంత్రుల్లో టీఆర్ఎస్ లో మొదటి నుండి ఉన్నవారు ఎవరున్నారో చెప్పాలన్నారు. Indrakaran Reddy, కొప్పుల ఈశ్వర్, Errabelli Dayakar Rao సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు  టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో లేరన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావులు కూడా తొలి నుండి టీఆర్ఎస్ లో పనిచేసినవారు కాదన్నారు.

 మహారాష్ట్రలో ఒక్కరే ఏక్‌నాథ్ షిండే ఉన్నారు. కానీ కేసీఆర్ పార్టీలో అందరూ ఏక్‌నాథ్ షిండేలేనని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వంద మంది ఏక్గ’నాథ్ షిండేలను ఉత్పత్తి చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏక్‌నాథ్ షిండేలకు కేసీఆర్ గాడ్ ఫాదర్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇలాంటి నువ్వు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటున్నారని రేవంత్ రెడ్డి  చెప్పారు. టీఆర్ఎస్ లో చేరేందుకు ఎవరూ కూడా సద్దంగా లేనందునే నీతులు చెప్పేందుకు కేసీఆర్ సిద్దమయ్యారన్నారు.

also read:నా సవాల్‌కి కట్టుబడి ఉన్నా: గజ్వేల్ నుండే పోటీ చేస్తానన్న ఈటల రాజేందర్

దేశంలో లక్ష గ్రామాల్లో  విద్యుత్ సౌకర్యం, లక్షలాది కిలోమీటర్ల రోడ్డు సౌకర్యం, తాగు, సాగు నీరు సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని రేవంత్ రెడ్డి అడిగారు. వేలాది విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో నిర్మించిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Minister Sridhar Babu Comments: భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరిస్తాం | Asianet News Telugu
Hyderabad: నెల‌కు రూ. 67 ల‌క్ష‌ల అద్దె.. హైద‌రాబాద్‌లో ఫేస్‌బుక్ పెద్ద స్కెచ్