నా సవాల్‌కి కట్టుబడి ఉన్నా: గజ్వేల్ నుండే పోటీ చేస్తానన్న ఈటల రాజేందర్

By narsimha lodeFirst Published Jul 11, 2022, 4:36 PM IST
Highlights

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి కేసీఆర్ పై పోటీ చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ప్రకటించారు. రెండు రోజుల క్రితం గజ్వేల్ నుండి తాను పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: Gajwel నుండి సీఎం KCR పై పోటీ చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే Etela R ajenderపునరుద్ఘాటించారు. సోమవారం నాడు BJP  కార్యాలయంంలో  మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం ఈటల రాజేందర్ ఈ విషయమై మీడియాకు చెప్పారు. గజ్వేల్ నుండి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. సీఎం కేసీఆర్ పైనే తాను పోటీ చేస్తానని తెలిపారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున TRS  నుండి తమ పార్టీలోకి వలసలు కూడా ఉంటాయని ఆయన రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.

కేసీఆర్ పోటీ చేస్తాననే తన సవాల్ కు కట్టుబడి ఉన్నట్టుగా ఈటల రాజేందర్ చెప్పార. తన తల్లి తనకు సంస్కారం నేర్పించిందన్నారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే మాదిరిగానే కేసీఆర్ ను కూడా ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు.తనపై వ్యక్తిగత దూషఫలకు దిగితే సహించేది లేదని ఈటల రాజేందర్ చెప్పారు.

Latest Videos

also read:కేసీఆర్ వ్యుహం ఎంటో తెలుసు.. హుజురాబాద్‌లో ఓటుకు నోటు ఇచ్చింది ఆయనే: ఈటల రాజేందర్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నుండి పోటీ చేస్తానని పార్టీ జాతీయ నాయకత్వానికి తెలిపినట్టుగా కూడా ఈటల రాజేందర్ ప్రకటించారు. ఈ విషయమై గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను పోటీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా ఈటల రాజేందర్ తెలిపారు. 

కొద్ది రోజుల క్రితమే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఈటల రాజేందర్ ఢిల్లీలో భేటీ అయ్యారు.  ఈ భేటీలో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాంపై అమిత్ షాతో ఈటల రాజేందర్ చర్చించినట్టుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. ఈ తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది. మరో వైపు ఈ నెల 2,3 తేదీల్లో నిర్వహించిన  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో జోష్ ను నింపాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ ధీమాను వ్యక్తం చేసింది. తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రానుందని కూడా ఆ పార్టీ విశ్వాసంతో ఉంది.ఈ దిశగా కార్యాచరణను కొనసాగించనుంది.

టీఆర్ఎస్ లో చాలా కాలం పాటు క్రియాశీలకంగా ఉన్న ఈటల రాజేందర్  ఆ పార్టీ నుండి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. హుజూరాబాద్ నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.  బీజేపీలోకి ఇతర పార్టీల నుండి నేతలను చర్చుకొనే కమిటీకి ఈటల రాజేందర్ ను ఆ పార్టీ చైర్మెన్ గా నియమించింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో బలమైన నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఈటల రాజేందర్ నేతృత్వంలోని కమిటీ క్రియాశీలకంగా పని చేయనుంది. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్తులపై బీజేపీ నాయకత్వం కేంద్రీకరించనుంది.
 

click me!