తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎప్ బృందాలు రంగంలోకి దిగాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎన్డీఆర్ఎప్ బృందాలను రంగంలోకి దించారు.తెలంగాణలో వరదలు, వర్షాలపై సీఎం కేసీఆర్ సోమవారం నాడు కూడా సమీక్షించారు.
హైదరాబాద్: Telangana రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో NDRF సిబ్బందిని రంగంలోకి దించారు. గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందన రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. భద్రాచలం, భూపాలపల్లి, ఆదిలాబాద్, వరంగల్ ,హైద్రాబాద్ లో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ములుగు జిల్లాకు ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది.
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ లో 19.4 సెం.మీ, భద్రాచలం లో 7.62, సెం.మీ, కాళేశ్వరంలో 30 సెం.మీ, వెంకటాపురంలో 17.8 సెం.మీ, కోటపల్లెలో 14.84 సెం.మీ., బెజ్జూరులో 13.36 సెం.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
undefined
తెలంగాణ రాష్ట్రంలో వర్షాల విషయంలో వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇవాళ సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల్లోని అధికారులు, మంత్రులతో పోన్లో మాట్లాడారు.
అధికారులతో వర్షం, వరదలపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో వైపు హైద్రాబాద్ లో ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖాధికారులు జారీ చేశారు.ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి వద్ద క్రమంగా నీటి మట్టం పెరుగుతుంది. భద్రాచలం వద్ద గోదావరి 53 అడుగులకు చేరింది. నిన్న 21 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం ఉండగా ఇవాళ సాయంత్రానికి 53 అడుగులకు చేరింది.
భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగడంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ నుండి వరద పరిస్థితిని అంచనా వేసి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.గోదావరి పరివాహక ప్రాంతంలో శ్రీరాంసాగర్ నుండి ధవళేశ్వరం వరకు గోదావరి నది పోటెత్తుతుంది. భద్రాచలం వద్ద గోదావరి నది 53 అడుగులకు చేరడంతో స్నాన ఘట్టాలు మునిగిపోయాయి. గోదావరి నదికి 100 ఏళ్లలో రాని వరద వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. గోదావరి వదర ముంపుతో భద్రాచలం వాసులు ఇబ్బందిపడే అవకాశం ఉంది.