పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు : నేతలకు రేవంత్ రెడ్డి హెచ్చరికలు

By Siva KodatiFirst Published Jan 21, 2023, 6:33 PM IST
Highlights

పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వచ్చే సమావేశాలకు హాజరుకాని నేతలను పదవుల నుంచి తొలగిస్తామని ఆయన తెలిపారు. 

పార్టీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. పార్టీ నియమావళి ఉల్లంఘించేవారిని ఉపేక్షించేది లేదన్నారు. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడిన వారిపై చర్యలు తప్పవని, పార్టీ కార్యకలాపాల్లో బాధ్యతగా పనిచేయని వారిని తప్పించి.. కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. అలాగే త్వరలో భద్రాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు తీర్మానం చేసినట్లు రేవంత్ తెలిపారు. ఈ సభకు సోనియా, ప్రియాంక రావాలని తీర్మానం చేసినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వచ్చే సమావేశాలకు హాజరుకాని నేతలను పదవుల నుంచి తొలగిస్తామని రేవంత్ హెచ్చరించారు. 

అంతకుముందు భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్), భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు రేవంత్. బీఆర్ఎస్ బీజేపీతో చేతులు క‌లిపింద‌ని ఆరోపించిన ఆయ‌న‌.. కాంగ్రెస్ ను బలహీనపర్చడానికే వారి క‌లిశార‌నీ, అందుకే ముఖ్య‌మంత్రి మిగతా విపక్షాలతో సమావేశమవుతున్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ పరోక్షంగా బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతిస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలాగే, "కాంగ్రెస్‌ను బలహీనపరచడానికి బీజేపీ.. బీఆర్‌ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం)లను ఉపయోగిస్తోంది" అని అన్నారు. 

ALso REad: ఇంకా కొట్టుకుంటూ ఉంటే ఎన్నికలకు ఎప్పుడు వెళ్తాం.. ఆ బాధ్యత రేవంత్‌ రెడ్డిదే: మాణిక్‌రావ్ ఠాక్రే

ఇకపోతే.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన మాణిక్‌రావ్ ఠాక్రే రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలతో సమావేశమైన మాణిక్ రావ్ ఠాక్రే.. ఈరోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పరాయి భావన వద్దని కూడా ఆయన పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇంకా కొట్టుకుంటూ ఉంటే ఎన్నికలకు ఎప్పుడు వెళ్తారని పార్టీ నేతలను సూటిగా ప్రశ్నించారు. సీనియర్ నేతలు ఏకతాటిపైకి వచ్చిన పనిచేయాలని చెప్పారు. పార్టీలో అందరిని కలుపుకోవాల్సిన బాధ్యత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిదేనని అన్నారు. 

తాను ఎవరికి వ్యతిరేకం కాదు.. ఎవరికి అనుకూలం కాదని చెప్పారు. అధిష్టానం చెప్పింది చేయడమే తన విధి అని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడొద్దని చెప్పారు. పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరూ మాట్లాడొద్దని అన్నారు. ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలని.. తాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇక, రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. 
 

click me!