భద్రాద్రి కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్: భర్తపై దాడి, పోలీసుల దర్యాప్తు

Published : Aug 10, 2023, 01:17 PM IST
భద్రాద్రి కొత్తగూడెంలో  సినీ ఫక్కీలో  వివాహిత  కిడ్నాప్: భర్తపై దాడి, పోలీసుల దర్యాప్తు

సారాంశం

భద్రాద్రి కొత్తగూడెంలో  సిన్నీ ఫక్కీలో  గురువారంనాడు వివాహితను  కిడ్నాప్  చేశారు.

ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెంలో   సిన్నీ ఫక్కీలో  వివాహితను కిడ్నాప్ చేశారు. భర్తపై దాడి చేసి వివాహితను  కిడ్నాప్ చేశారు.ఈ విషయమై  భర్త  పోలీసులకు  ఫిర్యాదు  చేశాడు.ఖమ్మం పట్టణానికి  చెందిన సన్నీ అనే యువకుడు  భద్రాద్రి కొత్తగూడెం పట్టణానికి చెందిన మాధవిని నాలుగేళ్లుగా  ప్రేమించుకుంటున్నారు.

నాలుగు మాసాల క్రితం వీరిద్దరూ  పెళ్లి చేసుకున్నారు.  వీరిద్దరూ ఖమ్మంలో ఉంటున్నారు.  అయితే  ప్రాజెక్టు  వర్క్ కోసం  మాధవిని భర్త కొత్తగూడెం కాలేజీకి  గురువారంనాడు తీసుకెళ్తున్నాడు.  ఈ విషయాన్ని గుర్తించిన మాధవి తరపు బంధువులు  సన్నీపై దాడి చేసి  మాధవిని కారులో తీసుకెళ్లారు.ఈ విషయమై   సన్నీ  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...
CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu