కేసీఆర్ 100 తప్పులూ పూర్తయ్యాయి.. ఇక కాంగ్రెస్‌దే అధికారం : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Nov 14, 2023, 3:09 PM IST

కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయని.. ఇక కాంగ్రెస్ విజయం ఖాయమని రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే రైతులతో పాటు కౌలు రైతుకు కూడా రైతు భరోసా ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. కేసీఆర్ ఓడిపోతే ఇంటి కరెంట్ బిల్లు కట్టాల్సిన అసవరం లేదని.. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే ఇళ్లకు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. 


స్టేషన్ ఘన్‌పూర్‌కు వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజ్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌దని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మంగళవారం స్టేషన్ ఘన్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ వచ్చిన మొదటి ఏడాదే రెండు పనులు చేయించే బాధ్యత నాది అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమి లేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. మంత్రివర్గంలో నలుగురు మహిళలకు స్థానం కల్పిస్తామని.. బిల్లులు రావడం లేదని సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటామని అంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

బీరు సీసాలు అమ్ముకుని బిల్లులు కట్టుకోవాలని ఎర్రబెల్లి అంటున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో అధికారం కోల్పోతామని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని రేవంత్ దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే ఉద్యోగాలు రాని యువత అడవి బాట పట్టే అవకాశం వుందని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయని.. ఇక కాంగ్రెస్ విజయం ఖాయమని రేవంత్ పేర్కొన్నారు. 

Latest Videos

undefined

కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ అవుతోందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తే రైతులతో పాటు కౌలు రైతుకు కూడా రైతు భరోసా ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఉపాధి హామీ కూలీకి వెళ్లే ప్రతి ఒక్కరికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని.. 2004లో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలోకి  వస్తే 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ ఇస్తామని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ ఓడిపోతే ఇంటి కరెంట్ బిల్లు కట్టాల్సిన అసవరం లేదని.. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే ఇళ్లకు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

click me!