పాదరసంలాంటి కార్యకర్తలే మాకు ప్రశాంత్ కిషోర్‌లు: రేవంత్ రెడ్డి

Published : Jul 07, 2021, 04:21 PM IST
పాదరసంలాంటి కార్యకర్తలే  మాకు ప్రశాంత్ కిషోర్‌లు: రేవంత్ రెడ్డి

సారాంశం

పాదరసంలాంటి మా పార్టీ కార్యకర్తలే మాకు ప్రశాంత్ కిషోర్‌లు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  పార్టీ కార్యకర్తలే  ఏకే 47 తూటాలని ఆయన చెప్పారు.

 హైదరాబాద్: పాదరసంలాంటి మా పార్టీ కార్యకర్తలే మాకు ప్రశాంత్ కిషోర్‌లు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  పార్టీ కార్యకర్తలే  ఏకే 47 తూటాలని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి  ప్రశాంత్ కిషోర్ ను సలహదారుగా నియమించుకోవాలని కొందరు మిత్రులు తనకు సలహా ఇచ్చారని  ఆయన చెప్పారు.  ఈ సలహా ఇచ్చిన మిత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తనకు పీకేలు, ఏకే 47 తూటాలు అని ఆయన  చెప్పారు.

also read:టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ ప్రమాణం: జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ డుమ్మా

పాదరసంలాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలున్న  తమకు  ప్రశాంత్ కిషోర్ లు అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రతి పార్టీ కార్యకర్త  పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు వారానికి రెండు రోజుల పాటు పార్టీ కోసం పనిచేయాలని ఆయన కోరారు.ఏదైనా గ్రామానికి వెళ్లి మంచినీళ్లు అడిగితేనే జీవితాంతం  సుఖంగా ఉండాలని దీవించే  మనస్తత్వం తెలంగాణ వాసులదన్నారు. ఇలాంటి తెలంగాణ వాసులు 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ కోరిక తీర్చాలని ఆయన కోరారు.ఏపీలో  సర్వనాశనమై, తెలంగాణలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూనే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్