
ఆదిలాబాద్: ఒక్క దెబ్బకు వంద దెబ్బలు కొడతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుపై ఆయన సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా సభను నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
also read:118 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు రావాలి: ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి
రజాకార్లు కూడ నిజాం రాజ్యాన్ని కాపాడలేదని ఆయన గుర్తు చేశారు. కొందరు పోలీసులు కేసీఆర్ ప్రభుత్వానికి వంతపాడుతున్నారని ఆయన మండిపడ్డారు.ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుతావా అని ఆయన ప్రశ్నించారు.రిటైరై అమెరికాకు పారిపోయినా కూడ రెడ్ కార్నర్ నోటీసులు పంపి నిన్న రప్పించి ఇంద్రవెళ్లి అమరుల స్థూపం దద్ద మోకాళ్లపై కూర్చోబెడుతానని ఆయన హెచ్చరించారు.
మా కార్యకర్తలను కష్టపెడితే, కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. నిన్నటివరకు ఒక లెక్క, ఇవాళ్టి నుండి మరో లెక్క అని చెప్పారు. దెబ్బకు దెబ్బ..... ఒక్క దెబ్బ కొడితే వంద దెబ్బలు కొడతామన్నారు.కేసీఆర్ ను బొంద పెడతామని ఆయన హెచ్చరించారు. ఫామ్‌హౌస్‌లో ఉన్నా, ప్రగతి భవన్ లో ఉన్నా బద్దలు కొట్టుకొని వస్తానని చెప్పారు. 20 నెలల తర్వాత కేసీఆర్ ను చర్లపల్లి జైలులో పడుకొబెడుతానన్నారు.