కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు మింగారు: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి

By narsimha lode  |  First Published Aug 23, 2023, 5:26 PM IST

9 ఏళ్ల కాలంలో  రూ. 22 లక్షల కోట్ల అప్పులు తెచ్చి  ఏం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  కేసీఆర్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. 


హైదరాబాద్:కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 1.40 లక్షల కోట్లకు టెండర్లు పిలిచి రూ. లక్ష కోట్లను కేసీఆర్  దిగమింగారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.మాజీ మంత్రి చంద్రశేఖర్ బుధవారంనాడు గాంధీ భవన్ లో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా  టీపీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడారు.ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైందా అని ఆయన ప్రశ్నించారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో  ప్యాకేజీ 9, 21, 22 పూర్తి కాలేదన్నారు. కామారెడ్డి, సిరిసిల్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద  పనులు పూర్తి కాని విషయాన్ని  ప్రజలు తన దృష్టికి తీసుకు వచ్చారని రేవంత్ రెడ్డి  గుర్తు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 22లో  భాగంగా  కామారెడ్డిలో  పనులు పూర్తి కాలేదన్నారు. ఈ ప్యాకేజీ పనులు పూర్తి చేసే కామారెడ్డి అసెంబ్లీలో ఓట్లు అడగాలని రేవంత్ రెడ్డి   కేసీఆర్ ను డిమాండ్  చేశారు.తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పేదలకు  25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కేసీఆర్ ఈ 9 ఏళ్లలో రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడ నిర్మించలేదన్నారు. ఏ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లున్నాయో ఆ గ్రామంలో తాము ఓట్లు అడుగుతామన్నారు. ఏ ఊళ్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించిన గ్రామంలో తాము ఓట్లు అడగమని  రేవంత్ రెడ్డి కేసీఆర్ కు తేల్చి చెప్పారు.

Latest Videos

 ఇందిరమ్మ ఇళ్లున్న గ్రామాల్లో బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దని  కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్ కు సిద్దమా అని ఆయన ప్రశ్నించారు.ఈ సవాల్ ను స్వీకరిస్తే కేసీఆర్ పార్టీకి డిపాజిట్లు కూడ రావని రేవంత్ రెడ్డి  చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారం దక్కించుకున్న కేసీఆర్....ఉద్యోగాల నియామకాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

నీళ్లను జగన్ రెడ్డి ఆంధ్రకు తీసుకెళ్లాడని రేవంత్ రెడ్డి  ఆరోపించారు. నిధులను మేఘా కృష్ణారెడ్డి తన ఇంటికి తీసుకెళ్లాడన్నారు.  నియామకాలను కేసీఆర్  కుటుంబంలో జరిగాయని  రేవంత్ రెడ్డి  విమర్శించారు.9 ఏళ్లలో రూ. 22.50 లక్షలను  కేసీఆర్ సర్కార్ అప్పు తీసుకు వచ్చిందని రేవంత్ రెడ్డి  చెప్పారు. ఇంత అప్పు చేసి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

also read:మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరిక

హైద్రాబాద్ నగర ప్రజలకు అవసరమైన తాగు నీటి కోసం  కృష్ణా, గోదావరి జలాలను  తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చెప్పారు.ప్రాజెక్టులు, ఐటీ కంపెనీలను హైద్రాబాద్ కు తీసుకు వచ్చిన ఘనత  కాంగ్రెస్ పార్టీదని  రేవంత్ రెడ్డి  చెప్పారు. హైద్రాబాద్ ను అభివృద్ది చేసింది  తమ పార్టీ అన్నారు. అవసరమైతే చరిత్రను తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి  సీఎం కేసీఆర్ కు సూచించారు.
 

 

 

click me!