పార్టీయే ముఖ్యం, అవసరమనుకుంటే పీసీసీ చీఫ్‌గా తప్పుకుంటా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jan 04, 2023, 07:29 PM ISTUpdated : Jan 04, 2023, 07:32 PM IST
పార్టీయే ముఖ్యం, అవసరమనుకుంటే పీసీసీ చీఫ్‌గా తప్పుకుంటా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

తాను పీసీసీ వదులుకుంటే పార్టీ అధికారంలోకి వస్తుందంటే రాజీనామాకు సిద్ధమన్నారు రేవంత్ రెడ్డి. జానా, భట్టి, యాష్కీ, సంపత్ సూచనలను స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ వదులకుంటే పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే .. తాను రాజీనామాకు సిద్ధమన్నారు. పార్టీలో చిన్న చిన్న గొడవలున్నా సర్దుకుపోవాలని.. పది పనులు చేస్తుంటే ఒకటో రెండో తప్పులు దొర్లటం సహజమేనన్నారు. మనం మనుషులమని.. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని రేవంత్ అన్నారు. కానీ ఎవర్నీ ఇబ్బంది పెట్టాలని కాదని.. ఏపీలో తలమాసిన కొందర్ని కేసీఆర్ బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని రేవంత్ దుయ్యబట్టారు. ఏపీలో ఆస్తులు, విద్యుత్ బకాయిలలో కేసీఆర్ ఎవరిపక్షమని ఆయన ప్రశ్నించారు. జానా, భట్టి, యాష్కీ, సంపత్ సూచనలను స్వాగతిస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. జానా సలహాలు, సూచనలతో పార్టీని మూలమూలలకు తీసుకెళ్తామన్నారు.  ప్రజలకు నష్టం జరిగే చర్యలకు కాంగ్రెస్ పాల్పడదని రేవంత్ వ్యాఖ్యానించారు. 

ఇకపోతే... తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపారు. కాగా.. గత కొంతకాలంగా ఠాగూర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు. విభేదాలు చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్. ఆయన రిపోర్టుతో త్వరలో తెలంగాణకి కొత్త ఇన్‌ఛార్జ్‌ని నియమించాలని హైకమాండ్ నిర్ణయించింది. 

Also REad: తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్న మాణిక్యం ఠాగూర్

కాగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. తమ మాటకు గాంధీ భవన్‌లో విలువ వుండటం లేదని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన పలువురు నేతలు ఠాగూర్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా.. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఏర్పడిన వివాదాలకు పరిష్కారం చూపేందుకు, పార్టీని గాడిలో పెట్టే బాధ్యతను హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన తెలంగాణకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారితో చర్చించారు.టీ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయని,ఇవి పార్టీకి మరింత నష్టం చేకూరుస్తున్నాయని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. వీరి మధ్య వెంటనే సయోధ్య కుదర్చాల్సిన అవసరం ఉందని, ఇక ఆలస్యం చేయకుండా ఈ దిశగా ప్రయత్నాలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ఆయన హైకమాండ్ కు నివేదికను అందజేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్