రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారంనాడు ముట్టడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా 44 వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయమై తమ వైఖరిని స్పష్టం చేయాలని నిరుద్యోగ జేఏసీ కోరింది. లేకపోతే తాము ప్రగతి భవన్ ను కూడా ముట్టడిస్తామని నిరుద్యోగ జేఏసీ హెచ్చరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించారు.రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా పలు శాఖలకు చెందిన ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ స్కూళ్లలోని పోస్టులను కూడా భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది.మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్నిముట్టడించిననిరుద్యోగ జేఏసీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.