తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్న మాణిక్యం ఠాగూర్

By Siva KodatiFirst Published Jan 4, 2023, 6:08 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నారు.  ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపారు. 
 

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నారు.  ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపారు. కాగా.. గత కొంతకాలంగా ఠాగూర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు. విభేదాలు చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్. ఆయన రిపోర్టుతో త్వరలో తెలంగాణకి కొత్త ఇన్‌ఛార్జ్‌ని నియమించాలని హైకమాండ్ నిర్ణయించింది. 

కాగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. తమ మాటకు గాంధీ భవన్‌లో విలువ వుండటం లేదని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన పలువురు నేతలు ఠాగూర్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా.. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఏర్పడిన వివాదాలకు పరిష్కారం చూపేందుకు, పార్టీని గాడిలో పెట్టే బాధ్యతను హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన తెలంగాణకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారితో చర్చించారు.టీ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయని,ఇవి పార్టీకి మరింత నష్టం చేకూరుస్తున్నాయని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. వీరి మధ్య వెంటనే సయోధ్య కుదర్చాల్సిన అవసరం ఉందని, ఇక ఆలస్యం చేయకుండా ఈ దిశగా ప్రయత్నాలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ఆయన హైకమాండ్ కు నివేదికను అందజేశారు.

click me!